»   » ఇద్దరు లెజెండ్స్.. ఇదో రేర్ ఫోటో: అప్పట్లో ఎన్టీవోడు.. నాగేశ్వరరావు..

ఇద్దరు లెజెండ్స్.. ఇదో రేర్ ఫోటో: అప్పట్లో ఎన్టీవోడు.. నాగేశ్వరరావు..

Subscribe to Filmibeat Telugu
లెజెండ్స్ ఎన్టీఆర్ & ఏఎన్నార్ ఆరోజుల్లో ధైర్యం చేసి హైదరాబాద్ రాబట్టే !

తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్-ఏఎన్నార్ రెండు మూల స్తంభాల లాంటివారు. చాలాకాలం పాటు తెలుగు సినిమాలను ఈ ఇద్దరే ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. ప్రేమ కథలు, సాంఘీక చిత్రాలతో నాగేశ్వరరావు క్లాస్ ఆడియెన్స్‌కు దగ్గరైతే.. పౌరాణికాలు, పొలిటికల్ సినిమాలతో మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యారు ఎన్టీఆర్. అడపాదడపా ఇద్దరు కలిసి కొన్ని చిత్రాల్లోనూ నటించారు. అలా ఈ ఇద్దరూ కలిసి నటించిన ఓ చిత్రంలోని ఫోటోను నాగార్జున తాజాగా ట్విట్టర్ లో షేర్ చేశారు.

 నాగ్ ట్వీట్.. 'అరుదైన ఫోటో':

నాగ్ ట్వీట్.. 'అరుదైన ఫోటో':

'గతానికి సంబంధించి ఇదో బ్లాస్ట్!! లెజెండ్స్ ఎన్టీఆర్&ఏఎన్నార్.. ఆ ఎడమ పక్కన ఉన్నది కేబీఆర్ పార్క్ గోడ, కుడివైపున అన్నపూర్ణ స్టూడియో. మధ్యలో ఆ రోడ్డు ఇప్పుడున్న జూబ్లీ చెక్ పోస్టు వైపు వెళ్లే మార్గం..' అంటూ నాగ్ ట్వీట్ చేశారు. లెజెండ్స్ పేర్లను తలుచుకుంటూ గౌరవసూచకంగా ట్వీట్ లో వారికి నమస్కారం కూడా పెట్టారు నాగ్.

ఎప్పటిదీ ఫోటో:

ఎప్పటిదీ ఫోటో:

నాగ్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటో ఏ సినిమాకు సంబంధించినది? అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. బహుశా.. 1978లో విడుదలైన 'రామకృష్ణులు' సినిమాకు సంబంధించిన స్టిల్ అయి ఉండవచ్చునని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.

 అప్పటికీ.. ఇప్పటికీ..:

అప్పటికీ.. ఇప్పటికీ..:

ఒకవేళ ఈ ఫోటో 'రామకృష్ణులు' సినిమాకు సంబంధించినదే అయితే.. 30ఏళ్ల క్రితం నాటికి ఇప్పటికీ ఎంత తేడా అనిపించకమానదు. ఒకప్పుడు అంత ఖాళీగా కనిపిస్తున్న ఆ స్థలంలో ఇప్పుడు ఎటూ చూసినా పెద్ద పెద్ద భవనాలే. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు కూడా చాలా మారిపోయాయి.

 నాగేశ్వరరావు కృషిని గుర్తుచేసుకుంటున్నారు:

నాగేశ్వరరావు కృషిని గుర్తుచేసుకుంటున్నారు:

ఈ ఫోటోను చూశాక.. సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ రావడంలో నాగేశ్వరరావు చేసిన కృషిని కొంతమందిని ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటున్నారు. ఆరోజుల్లో ఆయన ధైర్యం చేసి హైదరాబాద్ రాబట్టే.. ఆ తర్వాత ఒక్కొక్కరుగా చెన్నై నుంచి తరలివచ్చారని గుర్తుచేస్తున్నారు.

పరిశ్రమకు రెండు కళ్లు..:

పరిశ్రమకు రెండు కళ్లు..:

ఎన్టీఆర్&ఏఎన్నార్ కలయికలోని ఈ రేర్ ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇలాంటి ఫోటోను షేర్ చేసినందుకు కింగ్ నాగార్జునకు ఫ్యాన్స్ థ్యాంక్స్ చెబుతున్నారు. పరిశ్రమకు రెండు కళ్ల లాంటి ఈ ఇద్దరు అన్నీ వర్గాల మెప్పు పొంది ఆ స్థాయికి ఎదిగారని, వారి స్థానం చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోతుందని చెబుతున్నారు.

English summary
Tollywood King Nagarjuna shared a rare picture of NTR and ANR in twitter. He tweeted 'Blast from the past!!!the legends NTR & ANR That's the kbr park wall on the left and Annapurna studios on the right , the road leads to today's buzzing Jublee hills check post...isn’t that cool
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu