twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున 'షిర్డీ సాయి' ఎంతవరకూ వచ్చింది?

    By Srikanya
    |

    నాగార్జున, రాఘవేంద్రరావు దర్శకత్వంలో షిర్టీ సాయి చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నిమిత్తం ఆ మధ్యన షిర్డీలో మ్యూజిక్ సిట్టింగ్ జరిపారు. ఇప్పుడు హైదరాబాద్ లోని ప్రసాద్ కలర్ ల్యాబ్ కాంప్లెక్స్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుతున్నారు. పాటలు పూర్తిగా తృప్తికరంగా వచ్చేకే మిగతా పనుల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ చేయాలని రాఘవేంద్రరావు భావిస్తున్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు పాత్రలతో చారిత్రిక పాత్రలకు కూడా నిండుతనం తెచ్చి నిలబెట్టిన నాగార్జున చేయబోయే బాబా పాత్రకు ఇప్పటికే క్రేజ్ వచ్చింది.ఎ ఎమ్ ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.ఇక ఈ చిత్రానికి మరో విశేషం ఏమిటంటే రాఘవేంద్రరావు పర్మెనెంట్ రైటర్ జె.కె భారవి ఈచిత్రానికి రచన చేయటం లేదు.పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి రచన చేస్తున్నారు.

    ఈ సందర్భంగా కలిసిన మీడియాతో నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి మాట్లాడుతూ...బాబా జీవితాన్ని, ఆయన మానవాళికిచ్చిన సందేశాన్నీ తెరపై ఆవిష్కరించబోతున్నాం. భక్తి భావాన్ని పెంపొందింపజేసేలా ఉంటాయి ఇందులోని పాటలు ఉంటాయి. ప్రస్తుతం షిర్డీలో సంగీత చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికి మూడు బాణీలు సిద్ధమయ్యాయి. నవంబరు నాటికి పాటల రికార్డింగు పూర్తవుతుందని ఆయన చెప్పారు.

    మరో ప్రక్క క్యారెక్టర్ ఆర్టిస్టు సాయాజీ షిండే ఇప్పుడు నాగార్జుతో పోటీ పడటానికి సిద్దం అయ్యారు.నాగార్జున,రాఘవేంద్రరావు కాంబినేషన్ లో త్వరలో షిర్డీ సాయిబాబా చిత్రం తెరకెక్కనుందనే సంగతి తెలిసిందే.అయితే ఈ లోగా సాయాజీ షిండే తాను కూడా షిర్డి సాయిబాబాగా అవతారం ఎత్తటానికి సిద్దమయ్యారు.రాజవంశీ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ విషయమై షిండే మాట్లాడుతూ ..దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. తొలిసారి ఓ ఆధ్యాత్మిక పాత్రలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.ప్రస్తుతం నాగార్జున..ఢమురుకం చిత్రం షూటింగ్ లో ఉన్నారు.శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేస్తోంది.

    English summary
    Presently the music sitting of "Shirdi Sai" film is progressing at Prasad Colour Lab complex in Hyderabad. Earlier the music sitting was held at Shirdi and a few songs were composed. Film director Raghavendra Rao and music director Keeravani are participating in the music sittings.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X