»   » నాగార్జున కులుమనాలీలో ఏం చేస్తున్నారు?

నాగార్జున కులుమనాలీలో ఏం చేస్తున్నారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున తాజాగా చేస్తున్న పయినం చిత్రం షూటింగ్ కులుమనాలిలో జరుగుతోంది. ఆకాశమంత ఫేమ్ రాధా మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ గత శుక్రవారం ప్రారంభమైంది. ఈ చిత్రంలో నాగార్జున ఓ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు. అలాగే కీలక పాత్రల్లో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. తమిళంలో ప్రకాష్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఓ ధ్రిల్లర్ అనీ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో కూర్చోబెట్టేలా రూపొందిస్తున్నామని చెప్తున్నారు. చెన్నై నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్లైట్ హైజాక్ అవటం అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. కొంతమంది టెర్రరిస్టులు హైజాక్ చేసి ప్రయాణీకులను పట్టుకుని జైలులో ఉన్న తమ నాయకుడిని విడుదల చేయమని కోరుతారు. అప్పుడు రంగంలోకి దిగిన ఓ పోలీస్ ఆఫీసర్ ఆ సమస్యను ఎలా పరిష్కరిచాడు అన్నదే కథనం. నాగార్జున ఇది ఒక వెరైటీ చిత్రంగా భావించి చేస్తున్నారు. ఆయన ఎంతో ఊహించి చేసిన కేడీ చిత్రం ఫెయిల్యూర్ ని ఆయన కుమారుడు నాగచైతన్య ఏ మాయ చేసావే విజయం మరిపించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu