For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ‘శివ’ నాకు అమలను ఇచ్చింది, వర్మ తన్నమన్నాడు: నాగార్జున అదిరిపోయే స్పీచ్

  By Bojja Kumar
  |
  Nagarjuna Speech in Officer Movie Pre Release Event

  నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆఫీసర్'. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'శివ' ట్రెండ్ సెట్టర్. దాదాపు పాతికేళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 1న 'ఆఫీసర్' మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపత్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగార్జున ప్రసంగం ఆకట్టుకుంది.

   శివ నాకు అమలను ఇచ్చింది

  శివ నాకు అమలను ఇచ్చింది

  నాగార్జున మాట్లాడుతూ తెలుగు పరిశ్రమ ‘శివ'కు ముందు, ‘శివ' తరవాత అంటూ ఉంటారు. ‘శివ' వర్మకు బ్రేక్‌ ఇస్తే ... నాకు అమలను ఇచ్చింది... అంటూ నాగార్జున ఆసక్తికరంగా ప్రసంగించారు. నాగార్జున ఈ మాట అనగానే ఆడిటోరియం విజిల్స్‌తో మార్మోగిపోయింది.

  నా వయసు గురించి మాట్లాడొద్దు

  నా వయసు గురించి మాట్లాడొద్దు

  ఈ మధ్య కాలంలో నా ఏజ్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడటం దయచేసి మానేయండి. ఎందుకంటే నేను ఇప్పటికీ యువకుడినే. ఇందాకే చైతన్య అన్నాడుగా బ్రదర్ అని... దాన్ని గుర్తు పెట్టుకోండి చాలు, నా ఏజ్ గురించి మాట్లాడటం మానేయండి.... అంటూ నాగార్జున చమత్కరించారు.

  యంగ్ టీమ్‌తో పని చేశాను

  యంగ్ టీమ్‌తో పని చేశాను

  ఈ సినిమాకు పని చేసిన ‘ఆఫీసర్ టీంకు' కంగ్రాట్స్. ఈ టీమ్‌లో చాలా మంది యువతులు, యంగ్ పీపుల్ ఉన్నారు. బాంబేలో పని చేసినపుడు అందరినీ కలిశాను. వారితో పని చేస్తుంటే ముచ్చటేసింది. ఇలాంటి టీంను నాకు పరిచయం చేసినందుకు రామూకు థాంక్స్. వారిని చూస్తే నాలోనూ కొత్త ఉత్సాహం వచ్చింది అని నాగార్జున తెలిపారు.

  అందుకే ఈ సినిమా ఒప్పుకున్నాను

  అందుకే ఈ సినిమా ఒప్పుకున్నాను

  రామూ ఆఫీసర్ కథ చెప్పినపుడు ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ఒక పోలీస్ ఆఫీసర్‌ను ఎలా చూడాలనుకుంటున్నామో అలా చెప్పాడు. అతడు నమ్మిన నిజం కోసం పోరాడటం, ఏదైనా మొదలు పెడితే దాన్ని ఫినిష్ చేయడం, దేనికీ భయపడకుండా ఎవరినైనా ఎదుర్కోవడం, దేన్నయినా త్యాగం చేయడం అనే క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పకున్నాను.... అని నాగార్జున తెలిపారు.

  చెప్పినట్లు చేయకపోతే తన్నమన్నాడు

  చెప్పినట్లు చేయకపోతే తన్నమన్నాడు

  సినిమా మొదలు పెట్టేపుడు వర్మ నాకు ఒక లెటర్ రాశాడు. అందులో కొన్ని బూతు మాటలు కూడా ఉన్నాయి. అందుకే దాన్ని ఇపుడు నేను చదవదలుచుకోలేదు. ఒక వేళ నేను చెప్పింది చేయకపోతే ఎక్కడో తన్నమన్నాడు. రామూ నువ్వేం భయపడకు, నేను నిన్ను తన్నను. నువ్వు ఈ సినిమాని ఎంతో చిత్తశుద్ధితో చేశాడు.... అని నాగార్జున వ్యాఖ్యానించారు.

   సౌండ్ గురించి మళ్లీ ఇన్నాళ్ల తర్వాత

  సౌండ్ గురించి మళ్లీ ఇన్నాళ్ల తర్వాత


  ‘శివ' విడుదలైనప్పుడు సౌండ్‌ గురించి మాట్లాడారు. ఆ తరవాత అలాంటి మాటలు ఏ సినిమా విషయంలో వినిపించలేదు. ఇప్పుడు మళ్లీ స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్‌తో ‘ఆఫీసర్‌' వస్తోంది. ఆల్రెడీ సినిమా చూశాను. ఇది మీ గుండెలను తాకుతుందని చెప్పగలను... అని నాగార్జున తెలిపారు.

  చివరి 20 నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్ అద్బుతం

  చివరి 20 నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్ అద్బుతం

  యాక్షన్‌ సన్నివేశాలు హింసాత్మకంగా ఉన్నాయని చెప్పను కానీ చాలా రియాల్టీగా ఉంటాయి. ఇద్దరు మనుషులు ఒకరి మీద ఒకరికి కోపం ఉన్నపుడు, పగ ఉన్నపుడు రోడ్డు మీద ఎలా కొట్టుకుంటారో అది కళ్లకు కట్టినట్లు చూపించారు. చివరి 20 నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్ అద్బుతంగా ఉంది. బ్రూస్లీ, రాంబో సినిమాల రేంజిలో ఆ సీన్లు ఉన్నాయి... అని నాగార్జున తెలిపారు.

  మూవీ పిడికిళ్లు బిగించండి

  మూవీ పిడికిళ్లు బిగించండి

  ఇన్నాళ్లు రామూతో కలిసి పని చేయడం మంచి అనుభూతి. చాలా రోజుల తర్వాత ఒక రియల్, ఇంటెన్స్ ఉన్న యాక్షన్ సినిమా వస్తోంది. జూన్‌ 1 ఈ సినిమా వస్తోంది.. పిడికిళ్లు బిగించండి.... అంటూ నాగార్జున తన ప్రసంగం ముగించారు.

  English summary
  Nagarjuna Speech at Officer Movie Pre Release Event. Officer 2018 latest Telugu movie ft. Nagarjuna and Myra Sareen. Directed by RGV and Music composed by Ravi Shankar and produced by Ram Gopal Varma and Sudheer Chandra under A Company Production.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more