»   »  వస్తున్నాం.. మళ్లీ కొడుతున్నాం..ఇది ఫిక్స్, చైతన్య మాటని ఒప్పుకోను : నాగార్జున

వస్తున్నాం.. మళ్లీ కొడుతున్నాం..ఇది ఫిక్స్, చైతన్య మాటని ఒప్పుకోను : నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య కొత్త సినిమా రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. సినిమాకు నాగార్జున కూడా హాజరై.. ఈ సారి మళ్లీ చెబుతున్నా.. హిట్ కొడతాం అంటూ.. సినిమాపై పూర్తి భరోసా ఇచ్చేశాడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి రెండు బ్లాక్‌బస్టర్స్ ఇస్తానని గత ఏడాది నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే.

రారండోయ్ వేడుక చూద్దాం

రారండోయ్ వేడుక చూద్దాం

తన ఇద్దరు కుమారుల కెరీర్‌పై పూర్తిగా దృష్టి సారించిన నాగార్జున ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ఈ నెలలో ఒక బ్లాక్‌బస్టర్‌ను అక్కినేని అభిమానుల ముందుంచనున్నారు. అదే ‘రారండోయ్ వేడుక చూద్దాం.' నాగచైతన్య, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా ఆడియో వేడుక జరిగింది.


స్టెప్పులేశారు

స్టెప్పులేశారు

ఈ సందర్భంగా, ఆర్టిస్ట్ లకు వెల్ కమ్ చెబుతూ.. మేళాలు మోగిస్తూ వారిని లోపలికి స్వాగతం పలికారు. దీంతో నాగార్జున, నాగ చైతన్య, రకుల్ తదితరులు హుషారుగా స్టెప్పులేశారు. ఆ తర్వాత యాంకర్ రవికి, నాగార్జునకు మధ్య సరదా సంభాషణ జరిగింది. ‘ చైతన్య చెప్పినట్టు అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం సార్. మీరు ఏమంటారు?' అని ప్రశ్నించగా.. ‘ఇలానే మాట్లాడితే, నీకు జీవితాంతం పెళ్లి కాదు' అని నాగార్జున అనడంతో అంతా నవ్వుకున్నారు.రకుల్ ప్రీత్ సింగ్ ఓణీలు వేసుకుంటుంది

రకుల్ ప్రీత్ సింగ్ ఓణీలు వేసుకుంటుంది

ఈ ఆడియో వేడుకలో నాగార్జున మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో చక్కటి పల్లెటూరి పిల్లలాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓణీలు వేసుకుంటుంది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇక, కొడుకు గురించి తండ్రి ఎక్కువ పొగడకూడదు. మరి ఎలా? ఈ సినిమాకు నేను ప్రొడ్యూసర్ ని... ప్రొడ్యూసర్ గా చెబుతున్నాను.. నా హీరో సూపర్. చాలా బాగా చేశాడు.


ఇప్పుడు మళ్లీ అదే చెబుతున్నా

ఇప్పుడు మళ్లీ అదే చెబుతున్నా

మీరు, ఎలా చూడాలనుకుంటున్నారో అలా చేశాడు. ఈ సినిమాలో కొత్త నాగచైతన్యను చూస్తారు.. అతనితో ప్రేమలో పడిపోతారు. మై హీరో సూపర్.. నేను శిల్పకళా వేదికలో ‘సోగ్గాడే చిన్నినాయన' ఆడియో ఫంక్షన్ లో ఆ రోజు నేను ఏమన్నాను.. ఇప్పుడు మళ్లీ అదే చెబుతున్నా, వస్తున్నాం.. మళ్లీ కొడుతున్నాం..ఇది ఫిక్స్' అని నాగార్జున హుషారుగా అన్నారు.


అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం

అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం

ఈ సినిమా ట్రైలర్ చివర్లో ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం' అని చైతన్య చెప్పేదాన్ని తాను ఒప్పుకోనని స్పష్టం చేశాడు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతందని చెప్పడానికి కారణం చాలామంది ఉన్నారని, వాళ్లలో మొదటి వ్యక్తి దేవిశ్రీ ప్రసాద్ అని నాగ్ చెప్పాడు. బాగా ఇన్వాల్వ్ అయిపోయి చేశాడని, ఈ సినిమాతో దేవిశ్రీకి హ్యాట్రిక్ ఖాయం అని నాగార్జున అన్నాడు.


డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ

డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ

ఇక తరువాతి టెక్నీషియన్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ అని, అతడు క్యారెక్టరైజేషన్ బాగా చేస్తాడని నాగార్జున చెప్పాడు. ‘సోగ్గాడే చిన్నినాయన'లో తనకు బంగార్రాజు క్యారెక్టర్ ఇచ్చినట్లు ఈ సినిమాలో భ్రమరాంబ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అని, అలాగే చైతన్య క్యారెక్టర్ ‘శివ'ను కూడా ఒక ఆల్‌రౌండ్ క్యారెక్టర్ బాగా తీర్చిదిద్దాడని నాగార్జున ప్రశంసించాడు. కళ్యాణ్ కృష్ణ మరింత ఎదిగి పెద్ద డైరెక్టర్ కావాలని కోరుకుంటానని నాగ్ చెప్పాడు.English summary
The shooting of 'Rarandoy Veduka Chuddam' starring Naga Chaitanyna- Rakul Preet Singh has been wrapped up recently. While revealing the information, Nagarjuna said that the movie has all elements in right proportions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu