»   » 'భాయ్' లో నాగార్జున మూడు గెటప్స్ ఇవే

'భాయ్' లో నాగార్జున మూడు గెటప్స్ ఇవే

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: "ఇందులో నా పాత్రకు మూడు లుక్స్ ఉంటాయి. హాంకాంగ్‌లో డాన్‌కి రైట్ హ్యాండ్‌గా పనిచేసేటప్పుడు ఓ లుక్, పాతబస్తీకి పనిమీద వచ్చినప్పుడు ఓ లుక్, ఎప్పుడో విడిపోయిన ఫ్యామిలీని కలుసుకున్నప్పుడు మరో లుక్ ఇందులో ఉంటుంది అంటూ నాగార్జున తన తాజా చిత్రం భాయ్ లో తను కనపడే విధానం గురించి చెప్పుకొచ్చారు.

నాగార్జున హీరోగా నటించి, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నిర్మించిన చిత్రం 'భాయ్'. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పించింది. వీరభద్రం దర్శకుడు. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్. ఈ చిత్రం థాయ్‌లాండ్‌లో షూటింగ్ చేశారు. యూరప్‌లోనూ రెండు పాటల్ని చిత్రీకరించారు. ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ మెయిన్ హీరోయిన్. హంసానందిని, కామ్న జఠ్మలాని, నథాలియా కౌర్ గెస్ట్ అప్పియరెన్స్‌లు చేశారు.

ఇక సంగీతం గురించి చెప్తూ...సెప్టెంబర్ 1న పాటల్ని విడుదల చేస్తాం. దేవీ కనికరిస్తే. అతను చివరి వరకు ఏదో బెస్ట్ అవుట్‌పుట్‌ను తీసుకుని రావాలని దిద్దుతూనే ఉంటాడు. ప్రజలందరూ ఎప్పుడు సంతోషంగా సినిమాను చూస్తామంటారో అప్పుడే మేం సినిమాను విడుదల చేస్తాం. ప్రతిదానికీ కాలం సమాధానం చెప్తుంది. సినిమాను విడుదల రోజే ఆన్‌లైన్‌లో విడుదల చేసే పద్ధతి లో బడ్జెట్ సినిమాలకు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాకు మంచి ఫలితాన్నిస్తుంది అని అన్నారు.

నాగార్జున కొనసాగిస్తూ ...సోషల్ కాజ్ పెట్టి సినిమా చేస్తే ఇప్పుడు ఎవరూ చూడటం లేదు. సోషల్ కాజ్ అంటే అవినీతి, రాజకీయాల గురించి తీయాలి. కానీ ఈ రెండు సమస్యల గురించి సినిమాలను తీసి తీసి అరగదీశారు. నేను ఎన్విరాన్‌మెంట్ మీద సినిమా తీయాలనుకుంటున్నాను. కానీ ఇలాంటి సినిమాలను చాలా తెలివిగా, డాక్యుమెంటరీలాగా కాకుండా, ఎక్కడా బోరు కొట్టకుండా చిత్రీకరించాలి. తప్పకుండా అలాంటి సినిమాను తీస్తాను అన్నారు.

ఇక నేను పరిశ్రమకి వచ్చి 26 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంకెన్నాళ్లు మెయిన్ హీరోగా చేస్తానో తెలియదు. అందుకే ఇప్పుడు నేను చేసే ప్రతి సినిమా పూర్తిగా అందరికీ గుర్తుండాలని చేస్తున్నాను. ఇటీవల బయటి ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌లో సినిమాలు తగ్గాయి. కానీ మంచి ప్రొడక్షన్ వేల్యూస్‌తో సినిమా చేస్తే తప్పకుండా హిట్ అవుతుందని నేను నమ్ముతాను. అందుకే ఇప్పుడు భాయ్, మనం సినిమాలను మా సంస్థలోనే చేస్తున్నాం. నాన్న, చైతూతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో అఖిల్ అని అన్నారు.

English summary

 Speaking at a press conference, Nagarjuna said that he will be seen in three getups with various backdrops in the action entertainer. Directed by Veerabhadram Chowdhary, Bhai has Richa Gangiopadhyay as the female lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu