»   » విడుదలకు ముందే తన చిత్రం హిట్ కాదని చెప్తున్న నాగార్జున

విడుదలకు ముందే తన చిత్రం హిట్ కాదని చెప్తున్న నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ చిత్రం పెద్దహిట్ కాకపోవచ్చుగానీ ఓ మంచి సినిమా చూసామన్న అనుభూతి తప్పక ప్రేక్షకుడికి కలుగుతుంది అంటూ నాగార్జున తన తాజా చిత్రం 'గగనం" గురించి చెప్పుకొచ్చారు. నాగార్జున, ప్రకాశ్‌రాజ్, సనాఖాన్, పూనమ్ కౌర్ ప్రధాన పాత్రధారులుగా మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాధామోహన్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న 'గగనం" చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్ సినీమాక్స్‌లో మీడియావారికి ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ...శివ, అన్నమయ్య చిత్రాలు చేసిన తరవాత కలిగిన అనుభూతే 'గగనం' చిత్రం రషెస్‌ చూశాక కలిగింది. కొత్త యేడాది మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉండబోతోంది అన్నారు.

విమానం హైజాక్‌, తదనంతర పరిణామాల నేపధ్యంలో రూపొందే ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటూనే హాస్యాన్ని పంచుతుంది. గగనంలో నాగార్జున కమాండోగా చేస్తున్నారు. టెర్రరిజాన్ని రూపు మాపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ టీమ్‌కు బాస్‌ ఆయన. ఫ్లైట్‌ హైజాగ్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. విమానాన్ని హైజాగ్‌ చేసిన టెర్రరిస్టుతో ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు విఫలమవుతాయి. ఆ తర్వాత కమాండోలు ఏం చేశారు..? అనే ఆసక్తికర కథాంశంతో కథ సాగుతుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు కాందహార్‌ ఇన్సిడెంట్‌ను పోలి వుంటాయి. ఇందులో స్క్రీన్‌ప్లే హైలైట్‌ అని చెప్తున్నారు. ఎమోషనల్‌ డ్రామా నే హైలెట్ కానుందని అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu