»   » ఏసుక్రీస్తుగా కనిపించటం గురించి నాగార్జున

ఏసుక్రీస్తుగా కనిపించటం గురించి నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏసుక్రీస్తు పాత్ర అంటే..హాలీవుడ్ లో మహామహులు ఆ పాత్రను పోషించారు. దాన్ని మళ్ళీ నేను చేస్తాననడం హాస్యాస్పదమే అన్నారు నాగార్జున. తాను ఏసుక్త్రీస్తుగా కనిపిస్తానంటూ కొంత కాలంగా మీడియాలో నలుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ. అదే విషయం గురించి చెపుతూ.. 'ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్‌' అనే సినిమాను మెల్ గిబ్సన్ చేశాడు. క్రీస్తు రేపు చనిపోతాడనగా ఆయన ఎటువంటి అనుభూతులకు గురయ్యాడనే విషయాలతో ఆ సినిమా తీశాడు. అటువంటి కొత్త కథతో వస్తే నేను చేయటానికి సిద్దంగా ఉన్నా అన్నారు. ఇక మీ నాన్నగారు నాగేశ్వరరావు...ఈ చిత్రం మీరు చేస్తానన్నారు కదా అంటే...నాకైతే తెలీదు. ఒకసారి నేను 'వేమన' చేయాలనుందని చెప్పినట్లు నాతో ఎవరో అన్నారు. నాన్నగారు ఇలాంటి విషయాలు నాతో చెప్పరు. మీరు ఏదో అడుగుతారు. అందుకు ఆయన అలా బదులిచ్చి ఉండవచ అన్నారు. కేడీ ప్రమేషన్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక ఈ మధ్య కాలంలో తనకు నచ్చిన చిత్రాలు గురించి చెబుతూ...'త్రి ఇడియట్స్‌', 'పా' చిత్రాలు. అదుర్స్‌, నమో వెంకటేశ కూడా బాగున్నాయని విన్నాన అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu