For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగార్జున టార్గెట్ 100, టిక్కెట్ రేట్ల పెంపు సబబేనట!

  By Bojja Kumar
  |
  హైదరాబాద్ : నాలో సత్తా ఉన్నంతకాలం నటిస్తూనే ఉంటానని, వందకు పైగా సినిమాల్లో నటించాలనేదే నా కోరి అని కింగ్ నాగార్జున స్పష్టం చేసారు. ఇప్పటి వరకు 85పైగా చిత్రాల్లో నటించిన నాగ్.....త్వరలో వంద సినిమాలు పూర్తి చేసిన తీరుతానని తేల్చి చెప్పారు.

  నాగ చైతన్య, అఖిల్ సినిమాల నుంచి రిటైర్ అయినా తాను మాత్రం కానని చెప్పుకొస్తున్న ఆయన బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ లాగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని తన మనసులోని మాటను బయట పెట్టారు. డిఫరెంట్ జానర్లో ఉన్న సినిమాలు చేయడానికి సిద్ధమని వెల్లడించారు.

  సినిమా టిక్కెట్లు రేట్లను భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. రేట్లు పెరిగిన తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రం నాగార్జున్ నటించిన 'గ్రీకు వీరుడు'. దీనిపై నాగార్జున స్పందిస్తూ టిక్కెట్ రేట్లు పెంచడం సబబే అని వెల్లడించారు. అందుకు తగిన కారణాలను కూడా వెల్లడించారాయన.

  'షూటింగుల్లో జనరేటర్లకు వాడే డీజిల్ రేట్లు పెరిగాయి, నిత్యావసర సరుకుల ధరలు రెట్టింపు అయ్యాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు బాగా పెరిగియి. ఈ నేపథ్యంలో టిక్కెట్ల రేట్లు పెంచడం సబబే అనిపించింది. రెండున్నర గంటల వినోదానికి 10 నుంచి 15 రూపాయలు పెరిగినా ప్రేక్షకులు ఏమీ అనుకోరనే అనుకుంటున్నా' అని నాగార్జున వెల్లడించారు.

  గ్రీకు వీరుడు సినిమా విషయానికొస్తే ఈ చిత్రంలో నాగార్జున ఓ ఎన్నారైగా, డిఫరెంట్ గెటప్ లో స్టైలిష్‌గా కనిపించనున్నారు. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరత్ ఈ చిత్రానికి దర్శకుడు. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసారు. మే 3వ తేదీన ఈచిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  మీరాచోప్రా, కె.విశ్వనాథ్, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, వేణుమాధవ్, వెన్నెల కిషోర్, కాశీ విశ్వనాథ్, నాగినీడు, గీతాంజలి, సుధ, జయలక్ష్మి, జయవాణి, లహరి, ఇందు తదితరులు ఇతర పాత్రధారులు.

  ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.

  English summary
  Nagarjuna said, I will act more than 100 movies. I am very happy that Greeku Veerudu will be releasing on the day our Indian cinema completes 100 years. It is not planned actually. The film should have released in March and then on April 26th. But due to some reasons it has not happened. But I came to know about this yesterday and I felt excited about it, He added.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X