»   » అల్లు అర్జున్ కు ధాంక్స్ చెప్పిన నాగార్జున

అల్లు అర్జున్ కు ధాంక్స్ చెప్పిన నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శనివారం నాడు 62వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులకు సంబంధించి తెలుగు సినిమా విభాగానికి సంబంధించి విజేతల వివరాలు ప్రకటించారు. రేసుగుర్రం లో ఉత్తమ నటనటుకు గానూ అల్లు అర్జున్ కు ఫిల్మ్ ఫేర్ అవార్జుని దక్కించుకున్నాడు. రేసుగుర్రం చిత్రం 3 అవార్డులను దక్కించుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన అవార్డుని...అక్కినేని కి అంకితమంటూ ప్రకటించారు. దాంతో నాగార్జున ఈ క్రింద విధంగా స్పందించారు. నాగార్జున ఏమన్నారో ట్వీట్ లో చూడండి.

Thank you Allu Arjun for dedicating your award to ANR and your words - Akkineni Nagarjuna

Posted by Akkineni Nagarjuna on 28 June 2015

ప్రతి ఏడాది సౌత్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సారి కూడా చెన్నైలో ఈ వేడుక నిర్వహించారు. జూన్ 26న చెన్నైలోని ఇండోర్ స్టేడింయలో 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం వైభవంగా జరిగింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నాగార్జున ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయనా, కార్తీ - వంశీ పైడిపల్లి సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

నాగార్జున కొత్త చిత్రం విషయానికి వస్తే...

గతంలో నాగార్జున, రాఘవేంద్రరావు ల కాంబినేషన్ లో అన్నమయ్య చిత్రం వచ్చింది. వెంకటేశ్వరస్వామి భక్తుడుగా..తాళ్లపాక అన్నమాచార్యునిగా అందులో జీవించారు నాగార్జున. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రలో కనిపించనున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఆయన 'ఏడు కొండలవాడు' అనే టైటిల్ తో ఓ భక్తిరస ప్రధాన చిత్రం కమిటయ్యారని సమచారం.

గతంలో నాగార్జునతో షిర్డీ సాయి చిత్రం నిర్మించిన మహేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎప్పటిలాగే రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో రూపొందనుంది. ఇలాంటి చిత్రాల రచనలో అందె వేసేన చెయ్యి అయిన భారవి సైతం ఈ ప్రాజెక్టుకు పనిచేస్తున్నట్లు సమాచారం. ఏప్రియల్ నుంచిషూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్తున్నారు.

Nagarjuna thanks Allu Arjun

అయితే ఇందులో వెంకటేశ్వరస్వామిగానే నాగార్జున కనిపిస్తారని వెంకటేశ్వర మహత్యం చిత్రం తరహా పౌరాణిక గాధ అని వినిపిస్తోంది. ఇందులో ఎంత నిజముందనేది ప్రాజెక్టు ఫైనలైజ్ అయ్యి అధికారిక ప్రకటన వచ్చేకే తెలుస్తుంది.

ప్రస్తుతం నాగార్జున చేస్తున్న చిత్రం విషయానికి వస్తే...

నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా'. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో హాట్ హీరోయిన్ హంసా నందిని నటిస్తుంది. కొన్ని రోజులు షూటింగులో కూడా పాల్గొంది. తన పాత్ర వివరాలు వెల్లడించలేనని, నేను గతంలో నటించిన పాత్రల కంటే భిన్నమైన పాత్ర అని హంసా తెలిపింది. దర్శకుడు కథ చెప్పిన వెంటనే అంగీకరించిందట.

లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ కధానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత. ‘హలో బ్రదర్' తరహాలో వినోదాత్మక సినిమా అని సమాచారం.

English summary
King Nagarjuna thanked Allu Arjun for dedicating his award to his legendary father ANR. It is known that Bunny who won best actor award at the 62nd Britannia Filmfare Awards (South) for his performance in Race Gurram, paid floral tributes to legendary actor ANR by dedicating his award to him.
Please Wait while comments are loading...