»   » రమ్య కృష్ణ అందంపై నాగార్జున కామెంట్స్

రమ్య కృష్ణ అందంపై నాగార్జున కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు హలో బ్రదర్, అన్నమయ్య, ఘరానా బుల్లోడు క్రిమినల్ తదితర చిత్రాల్లో కలిసి నటించి యమ ఘాటుగా తెరపై రొమాన్స్ పండించారు నాగార్జున, రమ్య కృష్ణ. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ ఇధ్దరూ కలిసి జోడీగా నటిస్తున్న చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ మైసూరులో జరుగుతోంది. ఈ చిత్రంలో నాగార్జున తాత, మనవళ్లుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

షూటింగ్ విశేషాలు వెల్లడించడంతో పాటు రమ్యకృష్ణ అందంపై ప్రశంసల వర్షం కురిపించాడు నాగార్జున. ‘సోగ్గాడే చిన్ని నాయన షూటింగ్ 1500 సంవత్సరాల నాటి విష్ణు టెంపుల్ లో జరుగుతోంది. దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత రమ్య కృష్ణతో కలిసి నటిస్తున్నారు. ఆమె అందం ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు' అంటూ నాగార్జున ట్వీట్ చేసాడు.

Nagarjuna tweet about Ramya krishna

సినిమా విశేషాల్లోకి వెళితే...న్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా కల్యాణ్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి హీరోయిన్స్. వినూత్న కథాంశంతో గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున తాతమనవడిగా ద్విపాత్రాభినయంలో నటించనున్నట్లు సమాచారం. రెండు పాత్రలు సరికొత్త పంథాలో సాగుతాయని చిత్రబృందం చెబుతోంది.

వినోదం, కుటుంబ అనుబంధాల సమాహారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఆదివారం మైసూర్‌లో ప్రారంభమైంది. హీరో,హీరోయిన్స్ లతో పాటు చిత్ర తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. హంసానందిని, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

English summary
"Soggade Chinnni Nayana shooting in a vishnu temple1500 years old with dear ramyakrishna after 15 years/as gorgeous as ever:)" Nagarjuna tweeted.
Please Wait while comments are loading...