For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినిమా టెక్కెట్ రేట్లు పెరగాలి: నాగార్డున

  By Srikanya
  |

  హైదరాబాద్ : ముఖ్యంగా సినిమా టెక్కెట్ రేట్లు పెరగాలి. అన్నీ పెరుగుతున్నాయి, ఒక్క ఇవి తప్ప. సినిమా పరిశ్రమపై పన్నులు మీద పన్నులు వేస్తున్నారు కానీ, వీటి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. థియేటర్లలో కొనుక్కునే కూల్‌డ్రింక్స్, పాప్‌కార్న్‌తో పోలిస్తే టికెట్ రేట్లు తక్కువ అన్నారు నాగార్జున. ఆయన పుట్టిన రోజు ఈ రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ...ప్రస్తుతం ప్రేక్షకులు కొత్తదనానికి బ్రహ్మరథం పడుతున్నారు. డబ్బు ఇచ్చి టికెట్‌ కొనేవాడి మైండ్‌సెట్‌ బాగానే ఉంటుంది. వారు మారాల్సిన పనిలేదు. సినిమాల తీరే మారాల్సి ఉంది. ఇటీవల కాలంలో చిన్న సినిమాల విజయాలు హర్షించదగ్గది. డిజిటల్‌లో తీసిన 'బ్యాట్‌మేన్‌' పెద్ద సక్సెస్‌. హాలీవుడ్‌ టెక్నాలజీని మన యువదర్శకులు అందిపుచ్చుకోవాలి అని చెప్పారు.

  సినిమా పరిశ్రమలో సమస్యలు గురించి మాట్లాడుతూ...హీరో, దర్శకుడు, నిర్మాత ఒక టీమ్‌గా ఏర్పడి బాధ్యత తీసుకుంటే అన్ని సమస్యలూ కుదురుకుంటాయి. ఎవరికి వాళ్లు మనకెందుకులే ఈ గొడవ అనుకోవడం వల్లనే రకరకాల సమస్యలు. ఏదన్నా చెబితే హీరోలు, డెరైక్టర్ల పారితోషికాల గురించి మాట్లాడుతుంటారు. డిమాండ్ లేకుండా ఎవ్వరూ ఎవ్వరికీ భారీ పారితోషికాలివ్వరు. పారితోషికాలనే కాదు, ఇంకా చాలా చాలా సమస్యలున్నాయి అన్నారు.

  అలాగే...పౌరాణికాల్లో నటించడానికి నేనెప్పుడో సిద్ధం. కానీ ఇప్పటిదాకా దర్శకులెవ్వరూ ఆ కథలు తీసుకురాలేదు. 'మాయాబజార్‌' చూసినప్పుడల్లా పౌరాణిక చిత్రాల్లో నటించాలనే కోరిక మరింతగా పెరుగుతుంటుంది. ఆ తరహా చిత్రం రూపుదిద్దుకొంటే మాత్రం... మరొక మల్టీస్టారర్‌ అవుతుంది. వెంకటేశ్, మహేశ్‌బాబు కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చేస్తున్నారు. మళ్లీ మల్టీస్టారర్స్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. 'సీతమ్మ వాకిట్లో...' పెద్ద హిట్టు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే దీంతో తెలుగులో కొత్త ట్రెండ్ మొదలవుతుంది. మంచి మంచి కథలొస్తాయ్. మంచి హెల్తీ ట్రెండ్ మొదలువుతుంది. అప్పట్లో నాన్నగారు, ఎన్టీ రామారావుగారు కలిసి చాలా సినిమాలు చేశారు అన్నారు.

  'డమరుకం' సిజి వల్లే ఆలస్యం అయ్యింది. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలోని 'డమరుకం' చిత్రీకరణ పూర్తయింది. అయితే కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ వల్ల రిలీజ్‌ ఆలస్యమైంది. నిర్మాత ఆర్‌.ఆర్‌.వెంకట్‌ రాజీ లేకుండా ఖర్చు చేస్తున్నారీ సినిమాకి. సోసియోఫాంటసీ కథలో మాస్‌ మసాలాను అద్భుతంగా మిక్స్‌ చేసి దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. నా 25ఏళ్ల కెరీర్‌లో ఎవరూ చేయని కొత్త తరహా చిత్రమిది. బ్యాలెన్స్‌ పాటను ఈ నెల 30నుంచి చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్‌ 10న ఆడియో, అక్టోబర్‌ 12న సినిమా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. 2012నాటికి ప్రపంచం ఉండదు..అనే కాన్పెప్టుతో హాలీవుడ్‌ సినిమాలెన్నో వచ్చాయి. ఆ తరహా చిత్రమిది. గ్రహాల తీరుపెై స్పృషించారు. బొట్టు శీను తరహా మాస్‌ పాత్ర మరో హైలెైట్ అని చెప్పారు.

  ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న నాగార్జున కి ధట్స్ తెలుగు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

  English summary
  
 Nagarjuna is celebrating his 53th birthday today with his family and friends in Hyderabad. His much-anticipated devotional film is all set for an early September release, followed by Damarukum, the release of which was delayed due to the extensive computer graphics work on the film. Apart from these two flicks, Nag is also busy shooting for a romantic love story directed by Dasarath opposite Nayanthara. The actor also announced that he is doing a film, Bhai, under the direction of Veerabhadram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X