»   » నాగార్జున మొదటే వద్దన్నా నాగచైతన్యే

నాగార్జున మొదటే వద్దన్నా నాగచైతన్యే

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య తాజా చిత్రం దడ ప్లాప్ అవటంతో ఇప్పుడా ప్లాప్ కి కారణాలు వెతికే కార్యక్రమం మొదలైంది. ఇక ఈ చిత్రాన్ని మొదటే నాగార్జున వద్దన్నాడని అయితే నాగచైతన్య పట్టుదలతోనే ఈ చిత్రం తెరకెక్కి డిజాస్టర్ అయ్యిందని చెప్తున్నారు. మొదట ఈ చిత్రానికి స్క్రిప్టు వర్క్ చేసి నేరేషన్ ఇచ్చినప్పుడే నాగార్జున ఇందులో విషయం లేదని చెప్పాడని,అయితే ఇప్పుడు కథలు సినిమాలో ఉండటం లేదని కేవలం కధనమే సినిమాకి ప్రధానమని చెప్పి ఒప్పించారు.

అందులోనూ శివప్రసాద్ రెడ్డి కుమారుడు చందన్ రెడ్డి,అటు అజయ్ భుయాన్,ఇటు నాగచైతన్య ఏజ్ గ్రూప్ లు దగ్గరగా ఉండటంతో వారు ఆలోచన ధోరణి వేరుగా ఉందని, వారు హాలీవుడ్ తరహా టేకింగ్ తో ఓ కొత్త లుక్ తో సినిమాని తెరకెక్కిస్తామని చెప్పి నాగార్జుననని ఒప్పించారు. దాంతో తప్పని సరి పరిస్ధితుల్లో వారి చేతిలో సినిమాని పెట్టి నాగార్జున ఇప్పుడు తీరిగ్గా చింతిస్తున్నాడు.

మరో ప్రక్క కాజల్ ని రప్పించి సినిమాకి పబ్లిసిటీ ఇప్పించి ఉన్నంతలో సేవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపద్యంలో యాక్షన్ సినిమాలు అయిన బెజవాడ రౌడీలు, ఆటో నగర్ సూర్య లు ఏ రేంజిలో వర్కవుట్ అవుతాయనే సందేహాలు అప్పుడే అభిమానుల్లో మొదలయ్యాయి.నాగచైతన్య యాక్షన్ హీరోగా నిలదొక్కుకుంటాడో లేక ప్రేమ కథల హీరోగా మిగులుతాడో కాలమే తేల్చాలి.

English summary
Dada which is released one week back with unique negative talk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu