twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rajiv Gandhi దారుణ హత్యపై వెబ్ సిరీస్.. సూసైడ్ ఎటాక్‌కు థానునే ఎందుకు ఎంచుకొన్నారంటే? దర్శకుడు ఎవరంటే?

    |

    దేశ చరిత్రలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య సంఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. మే 21వ తేదీ, 1991న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ) సంస్థ ఆత్మాహుతిదాడికి పాల్పడిన ఘటనలో రాజీవ్ గాంధీతోపాటు 18 మంది మరణించడం సెన్సేషనల్‌గా మారింది. థాను, శివరాసన్, నళిని తదితరులు ఈ సూసైడ్ ఎటాక్‌కు పాల్పడటం దేశ ప్రజలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన భారతీయ చరిత్రలో చీకటి రోజుగా మారిపోయింది. దేశాన్ని విషాదంలో ముంచిన ఈ హత్య సంఘటనపై వస్తున్న వెబ్ సిరీస్ వివరాల్లోకి వెళితే..

     హంట్ ఫర్ రాజీవ్ గాంధీ అనే పుస్తకం ఆధారంగా

    హంట్ ఫర్ రాజీవ్ గాంధీ అనే పుస్తకం ఆధారంగా


    రాజీవ్ గాంధీ హత్య ఘటన, ఈ కేసు విచారణ నేపథ్యంతో వెబ్ సిరీస్‌ను తెరకెక్కించేందుకు దర్శకుడు నాగేశ్ కుకునూర్ సిద్దమవుతున్నారు. ఈ సినిమాను 90 డేస్: ది ట్రూ స్టోరి ఆఫ్ ది హంట్ ఫర్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ అనే పుస్తకం ఆధారంగా సినిమా రూపొందించే ప్లాన్‌లో ఉన్నారు. ఈ పుస్తకాన్ని అనిరుధ్య మిత్రా రచించారు.

     హత్యకు థానునే ఎందుకు ఎంచుకొన్నారు?

    హత్యకు థానునే ఎందుకు ఎంచుకొన్నారు?


    ఎన్నికల ర్యాలీని ఎందుకు ఎల్టీటీఈ టార్గెట్ చేసుకొన్నది? రాజీవ్ హత్యకు ఎల్టీటీఈ ఛీప్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఎందుకు తీవ్ర నిర్ణయం తీసుకొన్నారు? శ్రీలంక సివిల్ వార్ సమయంలో ప్రధాని రాజీవ్ పంపిన ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పాత్ర ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? శివరాసన్ సహాయంతో రాజీవ్ హత్యకు థానునే ఎందుకు ఎంచుకొన్నారు అనే అంశాల ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు.

    అనురాధ్య మిత్రా రచించిన పుస్తకం

    అనురాధ్య మిత్రా రచించిన పుస్తకం


    90 డేస్: ది ట్రూ స్టోరి ఆఫ్ ది హంట్ ఫర్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ పుస్తకం ఆధారంగా చేసుకొని అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత ఎలాహే హిప్టూలా వెబ్ సిరీస్‌కు ప్లాన్ చేశారు. తాజాగా అనురధ్య మిత్రా నుంచి హక్కులను తీసుకొన్నామని నిర్మాత అధికారికంగా వెల్లడించారు.

    వెబ్ సిరీస్‌గా తీస్తున్నాం

    వెబ్ సిరీస్‌గా తీస్తున్నాం


    రాజీవ్ భయంకర హత్య గురించిన వివరాలతో వెబ్ సిరీస్ నిర్మిస్తున్నాం. 90 డేస్: ది ట్రూ స్టోరి ఆఫ్ ది హంట్ ఫర్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ ఆధారంగా చూసుకొని ఆసక్తికరమైన కథనంలో కథను థ్రిల్లింగ్‌గా, ఆసక్తికరంగా చెప్పబోతున్నాం. నటీనటులు, సాంకేతిక నిపుణులు, బడ్జెట్ తదితర అంశాల గురించి డిస్కషన్స్ జరుగుతన్నాయి. త్వరలోనే అధికారికంగా అన్ని విషయాలు వెల్లడిస్తాం అని నాగేశ్ కుకునూర్ చెప్పారు.

    నాగేశ్ కుకునూర్ ఎవరంటే?

    నాగేశ్ కుకునూర్ ఎవరంటే?


    రాజీవ్ హత్య ఘటన తర్వాత కేసు దర్యాప్తు అంశం కోణంలో ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. సీబీఐ దర్యాప్తు, నేరస్థులను ఆచూకీ, వారిని వెంటాడిన తీరు, వారి స్థావరాలపై చుట్టుముట్టిన తీరు, ఇతర అంశాలను ప్రధానంగా తెరకెక్కించనున్నాం అని నాగేశ్ కుకునూర్ తెలిపారు. హైదరాబాద్ బ్లూస్ చిత్రంతో 1998లో దర్శకుడిగా మారిన నాగేశ్ కుకునూర్ ఆ తర్వాత బాలీవుడ్ కాలింగ్, ఇక్బాల్, దోర్, లక్ష్మీ, ధనక్ చిత్రాలను రూపొందించారు. ఇటీవల మోడరన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్‌తో ముందుకు వచ్చారు.

    English summary
    Hyderabad blues director Nagesh Kukunoor to direct Rajiv Gandhi murder plot as Web Series. This movie is produced by Elahe Hiptoola. Cast and crew and other things are at planning stage. Details will come soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X