»   » సల్మాన్ పెళ్లికి.... ఆ విషయానికి సంబంధం లేదు: నగ్మ

సల్మాన్ పెళ్లికి.... ఆ విషయానికి సంబంధం లేదు: నగ్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాజీ హీరోయిన్, ఆలిండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్న నగ్మ ఇటీవల బీహార్ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా మహిళా సాధికారతకు సంబంధించి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా మీడియా నుండి ఎదురైన ప్రశ్నకు ఖంగుతిన్నారు. తాను వచ్చిన పనికి... వారు అడిగిన ప్రశ్నకు సంబంధం లేక పోవడంతో అసహనానికి గురయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఓ విలేఖరి సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి స్పందించాలని కోరారు. దీనిపై నగ్మ స్పందిస్తూ నేను మహిళా సాధికారత సమస్య గురించి ఇక్కడకి వచ్చారు. ఆయన పెళ్లికి, మహిళా సాధికారతకు ఎలాంటి సంబంధం లేదు. పెళ్లి అనేది ఆయన వ్యక్తిగత విషయం అన్నారు.

Nagma about Salman Khan's marriage

సల్మాన్ ఖాన్ ఇటీవలే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్లుగా హిట్ అండ్ రన్ కేసులో నిందితుడుగా ఉన్న సల్మాన్ ఇటీవలే ఆ కేసు నుండి విముక్తి పొందారు. ఈ కేసు నుండి విముక్తికి ముందే తల్లిదండ్రులు పెండ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా.. ఒకవేళ కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే భార్యకు ఏం సమాధానం చెప్పుకోవాలి?, నా గురించి అడిగితే పిల్లలకు ఆమె ఏమని చెప్తుంది?, నీ తండ్రి జైల్లో ఉన్నాడని చెప్పడం బాగుంటుందా? అని సల్మాన్ వాపోయేవాడ.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఆ కేసు నుండి బయట పడటంతో...2016లో సల్మాన్ పెళ్లి జరుగుతుందని అంటున్నారు. హిట్ అండ్ రన్ కేసు నుంచి విముక్తి లభించడంతో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ రొమేనియా టీవీ యాంకర్ లులియాను పెళ్లాండేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

English summary
Salman Khan's marriage not a Woman Empowerment issue, says Nagma.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu