Just In
- 16 min ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 47 min ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 1 hr ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 3 hrs ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
Don't Miss!
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- News
ఏపీలో టెన్షన్, టెన్షన్- మొదలుకాని నామినేషన్లు- ఎస్ఈసీ ఆఫీసులోనే నిమ్మగడ్డ
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Automobiles
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రామ్ చరణ్ ఫేసే బుక్ కు స్పెషల్ నోటిఫికేషన్ వచ్చింది, అదేమిటంటే.. (వీడియో)
హైదరాబాద్: అందరికీ నమస్కారం, నా ఫేస్ బుక్ కు ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చింది అదేంటో మనం చూద్దాం అంటూ రామ్ చరణ్ ఆసక్తిగా మనల్ని పిలుస్తూ తన ఫేస్ బుక్ పేజిని ఓపెన్ చేసారు. ఇంతకీ ఆ నోటిఫికేషన్ ఏమిటి, దేని గురించి ఈ బిల్డప్ అనేది క్రింద చూడండి.
ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ తాజాగా నక్షత్రం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్, రెజీనా ప్రధాన పాత్రలలో నక్షత్రం అనే సినిమా తెరకెక్కుతుండగా ఈ మూవీపై అభిమానుల్లో ఫుల్ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణవంశీ. ఈ చిత్రానికి సంబంధించిన టెన్ లుక్స్ ని విడుదల చేస్తున్నామంటూ కృష్ణ వంశీ ఇటీవల ఓ వీడియో పోస్ట్ చేశాడు.
ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను హీరో రామ్‌చరణ్ శనివారం విడుదల చేశారు. ఫస్ట్‌లుక్ బావుందంటూ.. మొత్తం యూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ వీడియోను కృష్ణ వంశీ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
శ్రీ చక్ర మీడియా పతాకంపై కె. శ్రీనివాసులు, ఎస్. వేణుగోపాల్, సజ్జు 'నక్షత్రం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన రెజీనా నటిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ చిత్రంలో పోలీసు అధికారిగా అతిథి పాత్రలో కనిపించనున్నారు.
సాయిధరమ్ పోలీస్ పాత్రలో కనిపించనుండగా ప్రగ్యా జైస్వాల్ కూడా ఓ కీలక పాత్ర పోషించనుంది. యంగ్ హీరో తనీష్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.
ఇక సందీప్ కిషన్ ఈ సినిమాలో ఓ కానిస్టేబుల్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. పోలీస్ అవ్వడమే ధ్యేయంగా ఎదిగిన ఓ కుర్రాడు మొదట కానిస్టేబుల్ గా తన కెరీర్ ను ఆరంభించి.. ఆ తర్వాత ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది "నక్షత్రం" చిత్ర కథాంశం అని తెలుస్తోంది!
ఈ మూవీలో కొన్ని యాక్షన్ సన్నివేశాల్ని డూప్స్ లేకుండా చేసిన సందీప్ ఓ కార్ ఛేజింగ్ సన్నివేశాన్ని చేసేందుకు ఎలాంటి సెక్యూరిటీ కోరలేదట. ఇందులో కార్లన్నీ 150 కి. మీ వేగంతో వెళుతుంటే సందీప్ తన కారుతో వాటికి ఎదురుగా వెళతాడట. ఈ సన్నివేశం సినిమాలో హైలెట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక కొన్ని సన్నివేశాలలో సందీప్ మేకప్ లేకుండానే కనిపిస్తాడని సమాచారం.
అలాగే ఈ చిత్రంలో లంబాడీ పిల్ల గా రెజీనా కనిపించనుండగా.. ఆ పాత్రలో ఒదిగేలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్. ఏదేమైన మంచి కసితో ఈ సినిమా చేస్తోన్న కృష్ణవంశీ మంచి హిట్ కొడతాడని అంటున్నారు. ఇందులోని నటీనటులకు కూడా మంచి గుర్తింపు వస్తోందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.