»   » కృష్ణ వంశీ ‘నక్షత్రం’ అఫీషియల్ టీజర్ ఇదే...

కృష్ణ వంశీ ‘నక్షత్రం’ అఫీషియల్ టీజర్ ఇదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నక్షత్రం'. హిట్ కొట్టి చాలా కాలమైన కృష్ణ వంశీ ఈచిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నారు. సందీప్ కిషన్, రెజీనా, సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, తనీష్, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రం అఫీషియల్ టీజర్ ఈ రోజు రిలీజ్ చేసారు.

ఈ రోజు సందీప్ బర్త్ డే కావడంతో అతడికి విషెస్ చెబుతూ టీజర్ విడుదల చేశారు. కాప్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రం కృష్ణవంశీ మార్క్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుదని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.


పుకార్లకు తెరపడింది

గతేడాది ఈ సినిమాలోని ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో సందడి కనిపించింది. గత ఆరు నెలలుగా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ లేక పోవడంతో సినిమా ఆగిపోయిందని అంతా భావించారు. అయితే తాజాగా టీజర్ రిలీజ్ సినిమా వస్తుందని హింట్ ఇచ్చాడు కృష్ణ వంశీ. దీంతో ఆ పుకార్లకు తెర పడింది.


ఆర్థిక ఇబ్బందులు నిజమా?

ఆర్థిక ఇబ్బందులు నిజమా?

ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుందని, అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువ కావడంతో నిర్మాతలు చేతులెత్తేసారనే ప్రచారం జరిగింది. సినిమాను పూర్తి చేయడానికి కృష్ణ వంశీ సొంత డబ్బులు పెట్టి రిస్క్ చేస్తున్నట్లు టాక్.


సాయి ధరమ్ తేజ్ పాత్ర పెంపు

సాయి ధరమ్ తేజ్ పాత్ర పెంపు

సినిమాపై హైప్ తేవడానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పాత్ర నిడివి పెంచారని, ముందు ఆయనది 20 నిమిషాల గెస్ట్ పాత్ర అనుకున్నారని, అయితే తర్వాత ఆయన పాత్రను 40 నిమిషాలకు పెంచారని టాక్. సాయి ధరమ్ తేజ్ మీద ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని టాక్.


రిలీజ్ ఎప్పుడో?

రిలీజ్ ఎప్పుడో?

సినిమా రిలీజ్ ఎప్పుడు? అనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ మధ్య కృష్ణ వంశీ చేసే ప్రతి సినిమాకు ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. ఈ సారైన ఆయన హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.English summary
Here comes the much awaited teaser of Multistarrer action Movie Nakshatram.Starring : Sandeep Kishan, Sai Dharam Tej, Pragya Jaiswal, Regina, Music : S Venugopal & Sajju, Producer : Kalaipuli S. Thanu, Director : Krishna Vamsi, Production Company: Sri Chakra Media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu