»   »  ఎప్పుడూ నా కొలతల గొడవేనా?

ఎప్పుడూ నా కొలతల గొడవేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Namitha
హీరోయిన్ల కొలతల గురించి మాట్లాడుతూ, వాటి ప్రకారం ఉండాలని కోరుకోవడం అత్యాశే అంటోంది నమిత. ఇటీవల ఆమె శరీర కొలతలు విషయం ఓ పెద్ద ఇష్యూ క్రింద మారి అంతటా చర్చకు అంశంగా మారింది. ఈ విషయం గురించి జగన్మోహిని షూటింగ్ గ్యాప్ లో ప్రస్తావిస్తే ''36 - 24 - 36 ప్రకారం ఉండాలంటే ఇప్పుడున్న హీరోయిన్లలో ఎవరూ నిలబడలేరు. అందమనేది కొలతల్లోనో, జీరో సైజ్‌లోనో ఉండదు. అయినా నేను ఆ ప్రమాణాల ప్రకారం ఉండను. ఉండలేను. నాకిష్టమైన ఆహారం తీసుకొంటాను. తగిన వ్యాయామాలు చేస్తాను'' అంటోంది.
అయినా మీ మీడియా వాళ్ళకి వేరే టాపిక్సే ఉండవా...ఎప్పుడూ నమిత నడుం ఇంతంటుంది...అంత లావుంటుంది అంటూ కొలతల గురించి మాట్లాడుతారు అని చిరాకుపడింది. సర్లేండి కొలతలెందుకులెండి... ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? అని ప్రశ్నిస్తే ''షాపింగ్‌ చేయడమంటే మహా సరదా. కొత్త కొత్త డిజైన్లలో వస్తున్న దుస్తుల్ని కొంటూ ఉంటాను. సినిమా షూటింగ్‌ల కోసం వాళ్లు చెప్పిన దుస్తులు వేసుకోక తప్పదు. అవి మనకు నచ్చినా నచ్చకపోయినా. కాబట్టి మిగిలిన సమయంలో నా ఇష్ట ప్రకారం వస్త్రధారణ ఉంటుంది. అందుకే దుస్తులు కొనుగోలు చేస్తాను. తీరా కొన్న తరవాత వాటిని రెండుసార్లకి మించి వేసుకోలేకపోతున్నాను. వాటిని మరోసారి వేసుకొందామనుకొనే సరికి కొత్త దుస్తులు పిలుస్తుంటాయ''ని చెప్పిందీ బొద్దుగుమ్మ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X