»   » గాసిప్స్ ఇష్టపడే ముద్దుగుమ్మ కాదు బొద్దుగుమ్మ...?

గాసిప్స్ ఇష్టపడే ముద్దుగుమ్మ కాదు బొద్దుగుమ్మ...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆమధ్య బాబాయ్ తో ఆడిపాడిన శృంగారతార నమిత ఇప్పుడు అబ్బాయ్ తో కూడా చిందులేయడానికి రెడీ అవుతోంది. బాలకృష్ణతో కలిసి 'సింహమంటీ చిన్నోడే వేటకొచ్చాడే…" అంటూ 'సింహా" సినిమాలో తన అందాలు ప్రదర్శించిన సెక్సీతార నమిత, తాజాగా జూ ఎన్టీఆర్ తో జతకట్టనుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో జూ ఎన్టీఆర్ హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తున్న తాజా చిత్రంలో నమిత నటించనుందని తెలుస్తోంది. తను రూపొందించిన 'సింహా" సినిమా సూపర్ హిట్ అవడంతో, ఈ సెంటిమెంటుతో నమితను ఈ చిత్రంలో కూడా తీసుకోవాలని బోయపాటి అనుకుంటున్నాడట. దీనికి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పాడని యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ఈసారి ఆమెతో క్యారెక్టర్ కాకుండా ఐటెం సాంగ్ చేయించడానికి బోయపాటి ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకోసం మంచి ట్యూన్ కూడా చేయమని పురమాయించాడని అంటున్నారు. ఇక అబ్బాయ్ సరసన కూడా నమిత రెచ్చిపోతుందన్నమాట...

మామూలుగా తమ మీద వచ్చే గాసిప్స్ కి తారలు సీరియస్ గా స్పందిస్తుంటారు. చదువుకుని చాలా ఇరిటేట్ అయిపోతుంటారు. అయితే, ఈమధ్య కాలంలో ఇతర హీరోయిన్లు ఎవరూ చేయలేని రీతిలో అందాలు ప్రదర్శించి, సెక్సీమణిగా పేరుతెచ్చుకున్న నమిత మాత్రం ఈ విషయంలో రివర్స్ కేసనే చెప్పాలి. తనపై వచ్చే గాసిప్స్ చదువుకుని ఈ భామ చాలా ఆనందిస్తాదట. 'మీరు రాసే గాసిప్స్ చదువుకుని బాధపడతాననుకుంటున్నారా? లేదు... నా గురించి మీరు రాసే మంచి వార్తలకి ఎంతగా ఆనందిస్తానో, ఇలాంటి గాసిప్స్ కీ అంతే ఆనందిస్తాను. నేను సెలెబ్రిటీని కాబట్టే నా మీద రాస్తున్నారు. లేకపోతే రాయరు కదా? మీరు రాయడం ఆపేస్తే కనుక నాకు ఇమేజ్ లేనట్టే. అందుకని, వాటికి నేనేమీ అప్సెట్ కాను" అంటోంది ఈ బొద్దుభామ.

English summary
Gossips or gossip mongers are two things that the stars of the industry will hate talking to or even knowing them. Given the fact that they come out with the most unthinkable controversies, gossips though creative can sometimes lead to some really fatal consequences.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu