»   » చెన్నై వరదలు మనకు ఒక పాఠం: మహేష్ బాబు వైఫ్ నమ్రత

చెన్నై వరదలు మనకు ఒక పాఠం: మహేష్ బాబు వైఫ్ నమ్రత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చెన్నై వరదలు మనకు ఒక పాఠం లాంటివి అంటున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత. జీవితం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. జీవితం అంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగడం అంటూ...తన సోషల్ మీడియా పేజీ ద్వారా తన మనసులోని అభిప్రాయాన్ని వెల్లడించింది.

నీ దగ్గర ఏటీఎం కార్టు ఉంది... కానీ ఏటీఎం లేదు, నీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది కానీ చార్జింగ్ లేదు, నీకంటూ ఒక ఇల్లు ఉంది కానీ...అక్కడ ఉండే పరిస్థితి లేదు, నీకు కారు, బైకు ఉన్నాయి కానీ వాటిపై ప్రయాణించలేని పరిస్థితి. ఇవన్నీ నీకు అవసరమైన సమయంలో ఉపయోగపడేలేదు. కానీ ఎంతో మంది మంచి మనసు ఉన్న వారు నీకు ఇవన్నీ చేసారు. ప్రకృతి ప్రతాపం కింద మనమంతా నామ మాత్రులమనే విషయంలో అందరూ ఇప్పటికైనా రియలైజ్ కావాలి. ఒకరికొరరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగాలి' అని నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పేర్కొన్నారు.

Namrata about Chennai Floods

మహేష్ బాబుతో పాటు నమ్రత కూడా పలు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు సినిమాల్లో బిజీగా గడుపుతారు. ఇంటి బాధ్యతలతో పాటు మహేష్ బాబు తరుపు పలు చారిటీ కార్యక్రమాలు ఆమె స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఇటీవల చెన్నై వరద బాధితుల కోసం మహేష్ బాబు రూ. 10 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వ్యవహారాలను నమ్రత దగ్గరుండి చూసుకున్నారు.

English summary
Namrata shared a poster which had a beautiful message. Hailing nature as the boss, Namrata finally said:"Help each other and grow together".
Please Wait while comments are loading...