»   » వావ్..! నమ్రతా న్యూలుక్ బావుంది, సినిమా కోసమేనా.!?

వావ్..! నమ్రతా న్యూలుక్ బావుంది, సినిమా కోసమేనా.!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆమె ఒక‌ప్పుడు హీరోయిన్‌... బాలీవుడ్, టాలీవుడ్‌ల‌లో స్టార్ హీరోయిన్‌.... ఆ త‌ర్వా సినిమాల‌కు దూర‌మై పెళ్ళి చెసుకుంది... అయినా ఆమె నిత్యం వార్త‌ల్లో వ్య‌క్తిగానే నిలుస్తూ వచ్చింది.. ఆమె ఎవరూ అంటే టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు భార్య న‌మ్ర‌త ఆమె... ఆన్ స్క్రీన్‌కు దూరమై చాలా కాలమే అయినా నిత్యం వార్తల్లోని వ్యక్తిగా జనాల దృష్టిని ఆకర్షించడం మహేశ్ ప్రిన్సెస్ నమ్రతకే చెల్లింది. ప్రిన్స్‌తో మూడు ముళ్లు వేయించుకున్నాక... తెర వెనుకనే ఉంటూ భర్త చిత్రాల ఎంపిక దగ్గర నుంచి సినిమా ప్రమోషన్ వరకూ అన్ని వ్యవహారాలను చక్కబెట్టే నమ్రత... ఇప్పుడు స్టైల్ గేమ్‌తో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

Namrata At The Absalut Style Exhibition Launch Photos

కొద్ది రోజుల క్రితం తిరుమల వెంకన్నకు తలనీలాలు సమర్పించుకున్న నమ్రత... కొంతకాలం గుండుతో కనిపించింది. అయితే జుట్టు పెరుగుతున్న కొద్దీ రకరకాల హెయిర్ స్టైల్స్‌ను ట్రై చేస్తోంది ఈ మాజీ హీరోయిన్. త్వరలో ఆన్ స్క్రీన్‌పైకి వచ్చేందుకే గ్లామర్ పాళ్లను బాగా పెంచేస్తోందని తెలుస్తోంది.ఒకప్పటి మిస్ ఇండియా అయిన నమ్రత శిరోద్కర్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం మహేష్ బాబు భార్య గా ఆయన కి సంబంధించిన వ్యాపారాలను చూసుకుంటున్న నమ్రత ఇటీవలే ఓ ప్రయివేట్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరై త్వరలోనే ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటించబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఆ సినిమా ఏ భాషలో ఉంటుంది... ఆ సినిమాలో క్యారెక్టర్ ఏంటి అనే విషయాన్నీ మాత్రం చెప్పలేదు.


ఈ మధ్య ఓ మల్టీస్టారర్‌లో కనిపించబోతున్నట్లు నమ్రత ప్రకటించింది. ఆ సినిమా ఏంటనే విషయంపై ఆమె ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ... సదరు సినిమాలో నమ్రత అల్ట్రా గ్లామరస్‌గా కనిపించబోతోందని తెలుస్తోంది. అందులో భాగంగానే ఆఫ్ స్క్రీన్‌లోనూ గ్లామరస్ అప్పీరెన్స్‌లను ఇస్తోందని టాక్ వినిపిస్తోంది. మరి లాంగ్ గ్యాప్ తరువాత రీ-ఎంట్రీకి సిద్ధమవుతున్న నమ్రత ప్రేక్షకులను ఏ విధంగా సర్ ప్రైజ్ చేస్తుందో చూడాలి.

English summary
Superstar Mahesh's Wife Namrata Shirodkar in a newLook, Inagurates ABsalut Style Exhibition
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X