»   » మహేష్ పిల్లలు...ఇలా హాలీడేస్ ని...(ఫొటో)

మహేష్ పిల్లలు...ఇలా హాలీడేస్ ని...(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు పిల్లలు గౌతమ్,సితార ఎంత ముద్దుగా ఉండి అందరి దృష్టినీ తమ వైపుకు తిప్పేసుకుంటారో తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు తన తాజా చిత్రం శ్రీమంతుడు లో బిజీగా ఉంటే...అతని భార్య నమ్రత...తన పిల్లలని హ్యాలీడేస్ కు తీసుకువెళ్లారామె. ఇదిగో ఈ వెకేషన్ లోదే ఈ ఫొటో. ఈ ఫొటో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో వైరల్ లాగ ప్రయాణం చేసి అందరినీ ఆకట్టుకుంటోంది. మీరూ ఓ లుక్కేయండి మరి.

మహేష్ సినిమాల విషయానికి వస్తే...

మహేష్ బాబు - ‘మిర్చి' ఫేం కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మరియు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సినిమాని జూలై 17న రిలీజ్ చెయ్యడానికి సన్నాహలు చేస్తున్నారు. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే కథల్లో ఇట్టే ఇమిడిపోతారు మహేష్‌. 'మురారి', 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో ఆ విషయం రుజువైంది. అలా మరోసారి ఇంటిల్లిపాదినీ అలరించేలా ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది.

Namrata engaging Gautam and Sitara in their holidays.

మహేష్‌ సరసన శ్రుతి హాసన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రంలో పోరాటాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్రబృందం చెబుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. రాజేంద్ర ప్రసాద్‌, జగపతిబాబు, సుకన్య, అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి తదితరులు నటిస్తున్నారు.

ఇంకా టైటిల్ ఇంకా ఖరారు కాని ఈ సినిమాకి ‘శ్రీ మంతుడు' అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.మహేష్ బాబుతో మొదటి సారి శృతి హాసన్ జోడీ కట్టారు.

English summary
Mahesh is currently busy shooting for Srimanthudu, his wife Namrata seems to be engaging the two children Gautam and Sitara in their holidays.
Please Wait while comments are loading...