»   » సో క్యూట్: మహేష్ బాబు పిల్లలు....తల్లితో ఫన్..(ఫొటో)

సో క్యూట్: మహేష్ బాబు పిల్లలు....తల్లితో ఫన్..(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్..తన పిల్లల విషయంలో తానొక సెలబ్రెటీని అనే విషయం మర్చిపోయి ఎప్పుడూ ఫన్ గ ఉంటూంటుంది. మహేష్ షూటింగ్ లతో బిజీగా ఉన్నప్పుడు పిల్లలకు ఆ లోటు తెలియకుండా ఆమె ఇదిగో ఇలా వారితో క్వాలిటీ టైమ్ ని స్పెండ్ చేస్తూంటుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో అదే. ఈ ఫొటోలో నమ్రత..ఆమె పిల్లలు సితార, గౌతమ్ ని చూడవచ్చు. సితార ఎంత క్యూట్ గా ఉందో కదా...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మహేష్ తాజా చిత్రం విషయానికి వస్తే...

మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం, పూర్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఉగాది రోజు అంటే మార్చి 21 న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం ప్రస్తుతం జరుగుతున్న పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి కాగానే ఈ చిత్ర టీం పన్నెండు రోజుల షెడ్యూల్ కోసం ఫ్రాన్స్ కు వెళ్లనున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్ స్టంట్ మాస్టర్ యాక్షన్ అణల్ అరసు యాక్షన్ కంపోజర్ గా పనిచేస్తున్నాడు.

Namrata funtime with kids

తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ‘శ్రీమంతుడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంతో దర్శకుడు కొరటాల శివ తేల్చాల్సి ఉంది. ఈ విషయం విన్న ఫ్యాన్స్ ఈ టైటిల్ మహేష్ బాబు ఇమేజ్ కు తగిన విధంగా లేదని అంటున్నారు. ఈ టైటిల్ విషయమై కొరటాల శివ త్వరలోనే సోషల్ నెట్వర్కింగులో స్పందించే అవకాశం ఉంది.

మహేష్ తో ప్రాజెక్టు మొదలైన నాటి నుంచి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉండటం...వెంటనే దర్సకుడు కొరటాల శివ ఖండించటం కామన్ అయ్యిపోయింది. కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్‌ శైలికి తగ్గట్టుగా మాస్‌ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.

బిజినెస్ విషయానికి వస్తే....
ఓవర్ సీస్ లో లీడింగ్ డిస్ట్రిబ్యూటర్స్ సౌత్ ఇండియన్ క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ వారు మహేష్ బాబు,కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. మే 2015 లో ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఓవర్ సీస్ లోనూ భారీగ ఈ చిత్రం విడుదల కానుంది.

ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

English summary
Here is a latest pics of Namrata with Gautham and Sitara hanging out having fun time.
Please Wait while comments are loading...