»   » మహేశ్ కోసం నమ్రత డిఫరెంట్ రోల్.. ప్రిన్స్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా

మహేశ్ కోసం నమ్రత డిఫరెంట్ రోల్.. ప్రిన్స్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా

Written By:
Subscribe to Filmibeat Telugu

ప్రిన్స్ మహేశ్‌బాబు, దర్శకుడు మురుగదాస్ సినిమా అభిమానులు ఊరిస్తున్నది. ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతున్నది. సెప్టెంబర్‌లో రిలీజ్ అవుతుందా అంటే అదీ గ్యారెంటీ లేదనే మాట వినిపిస్తున్నది. తొలి టీజర్‌తో ఆకట్టుకోలేకపోయిన ప్రిన్స్.. రెండో టీజర్‌ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాడు. రెండో టీజర్‌ను దర్శకుడు మురగదాస్ జాగ్రత్తగా కట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం నమ్రత ఓ ప్రత్యేక పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నారు.

స్పైడర్ రెండో టీజర్

స్పైడర్ రెండో టీజర్

స్పైడర్ రిలీజ్‌కు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి రెండో టీజర్ కోసం ఎలాంటి తొందరపాటు లేకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు తెలుస్తున్నది. రెండో టీజర్‌‌లో 160 ఫ్రేమ్స్ ఉంటాయట. అందులో మహేశ్ చెప్పే రెండు పవర్ ఫుల్ డైలాగ్స్ అభిమానులను థ్రిల్ చేస్తాయట. టీజర్‌లో కథ రివీల్ కాకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు సమాచారం. మహేష్ బర్త్ డేను పురస్కరించుకొని ఫ్యాన్స్‌కు ఉత్సాహంలో సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు మురుగదాస్ సిద్ధమవుతున్నాడనేది తాజా సమాచారం.

ప్రిన్స్ బర్త్‌డేకు డబుల్ ధమాకా

ప్రిన్స్ బర్త్‌డేకు డబుల్ ధమాకా

ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ రెండు గిఫ్ట్స్ ని ఇవ్వబోతున్నాడు మురుగదాస్. స్పైడర్ ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా నార్మల్‌గానే ఉంది. దానికి మించిన ఒరిజినల్ లుక్‌ను టీజర్‌తోపాటు సిద్ధం చేస్తున్నారు. కాబట్టి ప్రిన్స్ బర్త్ డేకి బంపర్ బొనాంజా అభిమానులకు అందించబోతున్నారు. పాటల చిత్రీకరణ వచ్చే నెల మూడో వారంలో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

నమత్ర బిజినెస్ వ్యవహారాలు

నమత్ర బిజినెస్ వ్యవహారాలు

స్పైడర్ మూవీ బిజినెస్ డీలింగ్స్ చూసుకోవడం కోసం నమ్రత స్వయంగా రంగంలోకి దిగిందట. స్పైడర్ చిత్రానికి రెండు బ్రహ్మండమైన ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో మహేష్ తరఫున అవన్నీ చక్కబెట్టేందుకు నమ్రత అవన్నీ చూసుకుంటోందని టాక్. మహేశ్ సినిమా బిజినెస్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తుందట.

భరత్ అను నేను షూటింగ్‌‌లో మహేశ్

భరత్ అను నేను షూటింగ్‌‌లో మహేశ్

ఇదిలా ఉండగా మహేశ్ తన సినిమాల వేగం పెంచేస్తున్నాడు. సోమవారం నుంచి ‘భరత్ అను నేను' అనే చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ లో మహేశ్ పాల్గొంటాడు. సెప్టెంబర్ 27వ తేదీన స్పైడర్ చిత్రం రిలీజ్ అయితే భరత్ అను నేను సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాడు. స్పైడర్ రిలీజ్ ఆలస్యం అయినప్పటికీ ఐదు నెలల గ్యాప్ లో మహేష్‌కు సంబంధించిన రెండు సినిమాలు చూసే

భాగ్యం అభిమానులకు కలుగుబోతున్నది.

English summary
Prince Maheshbabu is getting ready with his second teaser for Spyder. This teaser is unvieled on August 9. Mahesh's wife Namrata doing special role for spyder. She is looking after business deal of this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu