»   » మహేష్ గురించిన నిజాలు ఇవే...నమ్రత

మహేష్ గురించిన నిజాలు ఇవే...నమ్రత

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండియాలోనే బెస్ట్ యాక్టర్..ప్రపంచంలోనే బెస్ట్ డాడ్ మహేష్...ఈ మాటలంటున్నది మరెవరో కాదు మహేష్ బాబు సతీమణి ఘట్టమనేని నమ్రత. ఆమె తన భర్త (మహేష్ బాబు) గురించి చెబుతూ..ఓ యాక్టర్ గా నేను అనుకునేది ఇండియాలో బెస్ట్ యాక్టర్స్ లో ఒకరని. నేను ఇండియాలోనే ఎందుకని చెప్తున్నానంటే నేను అలా ఫీలవుతూ గర్వపడుతూంటాను కాబట్టి. అతను గొప్ప నటుడు. అలాగే తన క్రాఫ్ట్ కి కమిట్ అయి ఉండే వ్యక్తి. ఇక భర్తగా అంటారా..అతను నమ్మశక్యం కానంత ప్రేమతో మాతో మెలుగుతారు. మేం బెస్ట్ ప్రెండ్స్ మి. అతనితో పరిచయం, పెళ్ళి నా జీవితంలో జరిగిన బెస్ట్ ధింగ్స్. నేను నా జీవితంలో ఆనందకరమైన ఫేజ్ లో ఉన్నాను. ఇంకా చెప్పాల్సిందేమైనా ఉందా. ఇక మహేష్ తండ్రిగా చెప్పాలంటే..నాకు తెలిసి ప్రపంచంలోనే బెస్ట్ డాడ్ అని నేనూ గౌతమ్ (మహేష్ కొడుకు) ఫీలవుతూంటాము. గౌతమ్ కి ఐడిల్..మహేషే. ప్రొద్దునే లేచి గౌతమ్ నవ్వుని చూడటం కన్నా మహేష్ కి ఆనందాన్ని ఇచ్చే అంశం వేరేది లేదు అంటూ చెప్పుకొచ్చారామె.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu