»   » మహేష్ బాబు భార్య నమ్రత అలా మాట్లాడిందేంటి?

మహేష్ బాబు భార్య నమ్రత అలా మాట్లాడిందేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాజీ నటి, మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఇటీవల రిట్జ్ మేజగైన్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా లెంతీగా సాగిన ఈ ఇంటర్వ్యూలో ఆమె తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలతో పాటు మహేష్ బాబు జీవితంలో తన పాత్ర, ఇతర విషయాల గురించి చెప్పుకొచ్చారు.

అయితే ప్రస్తుతం వస్తున్న సినిమాల మీద, ఇతర హీరోల మీద నమ్రత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె కామెంట్స్ హర్టయ్యేలా ఉన్నాయి అని అంటున్నారు కొందరు. నమ్రత తన భర్తను కాస్త ఓవర్ గా పొగడటంతో పాటు, ఇతర హీరోలను తక్కువ చేసి విధంగా మాట్లాడిందని అంటున్నారు.

'నేను మహేష్ బాబుకు వీరాభిమానిని. ఆయనకంటే టాలెంటెడ్, బెటర్ హీరో ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా? అనే విషయం గురించి పట్టించుకోను. ఆయన్ను ఇంకా బెటర్ గా చూడాలని కోరుకుంటాను. ఇండస్ట్రీ మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటాను. మహేష్ బాబును తన కెరీర్లో డిఫరెంట్ పాయింట్లలో చూడాలని ఆశిస్తాను. నేను కేవలం మహేష్ బాబు సినిమాలు మాత్రమే చూస్తాను' అని నమ్రత చెప్పుకొచ్చింది.

Namrata Mahesh Babu's Interview Attract Controversy

'మహేష్ బాబుకు ఎలాంటి కాంపిటీషన్ లేదు. ఆయన ఒక దారిలో వెలుతున్నారు. ఆ దారిలో ఆయన సమకాలీనులు కూడా ఉండొచ్చు. నేను ఆయన్ను పెళ్లాడిన సమయంలో...ఆయనకంటే బెటర్ ర్యాంక్డ్ స్టార్స్ ఉన్నప్పటికీ ఆయనే బెస్ట్ అని భావించేదాన్ని' అని నమ్రత చెప్పుకొచ్చింది.

అయితే నమ్రత ఇంటర్వ్యూ చదవిన ఇతర స్టార్ల ఫ్యాన్స్..... నమ్రతపై తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం మహేష్ బాబు సినిమాలు మాత్రమే చూసే నీవు ఇతర స్టార్ల గురించి మాట్లాడటం ఎందుకమ్మా? అని ప్రశ్నిస్తున్నారు.

English summary
Namrata Shirodkar, the Tollywood's first lady, as addressed by the Ritz Magazine, has given the monthly a lengthy interview, where she spoke about the Telugu film industry, her role in Mahesh's career and many more in general. However, her comments on the present day films and the heroes have hurt a few, as they think Namrata has gone overboard praising her husband, by depreciating the rest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu