»   » ‘శ్రీమంతుడు’... మహేష్ బాబు భార్య నమ్రత కీలకంగా!

‘శ్రీమంతుడు’... మహేష్ బాబు భార్య నమ్రత కీలకంగా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీమంతుడు' మూవీ పూర్తి ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 7న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగస్వామిగా ఉన్నారు. జి.మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. ఆయన నిర్మాణ సంస్థ జి.మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, మైత్రి మూవీస్ సినిమా ద్వారా వచ్చిన లాభాలను షేర్ చేసుకుంటాయి. ‘శ్రీమంతుడు' సినిమాకు సంబంధించిన మార్కెటింగ్ విషయాలను మహేష్ బాబు భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారు.

ఈ విషయమై ప్రముఖ ఆంగ్లపత్రికతో నమ్రత మాట్లాడుతూ...‘శ్రీమంతుడు మార్కెటింగ్ వ్యవహారాలను నేను చూసుకుంటున్నాను. ప్రస్తుతం అందుకు సంబంధించి కాస్త బిజీగా గడుపుతున్నాను. ఈ పనులు చూసుకోవడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది' అని నమ్రత వెల్లడించారు.

Namrata revealed that she is taking charge of the Srimanthudu

ఈచిత్రం ఈ నెల 31న సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోబోతోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా సెన్సార్ సర్టిఫికెట్ ‘U' వస్తుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. 2015 సంవత్సరంలోని విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఇదీ ఒకటి. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించారు.

జగపతి బాబు, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, సుకన్య, సంపత్ రాజ్, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి సంయుక్తంగా మైత్రి మూవీ మేకర్స్ బేనర్లో...జి మహేష్ బాబు ఎంట్టెన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు.

English summary
Speaking to a leading English news daily, Namrata revealed that she is taking charge of the Srimanthudu movie marketing side and that she is quite enjoying this demanding yet an exciting job.
Please Wait while comments are loading...