»   » మురుగదాస్ ప్రాజెక్ట్: సెకండ్ హీరోయిన్ గా మహేష్ భార్య నమ్రత!

మురుగదాస్ ప్రాజెక్ట్: సెకండ్ హీరోయిన్ గా మహేష్ భార్య నమ్రత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ద్విబాషా చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

కథ ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్ షూటింగ్ అంతా రాత్రి వేళల్లోనే జరుగుతోంది. వారం రోజుల పాటు రాత్రి షూటింగే ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా ఈ సినిమాలో నటిస్తోందట. అయితే ఫుల్ లెంగ్త్ మాత్రం కాదు.... ఆమె ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు టాక్.

నమ్రత కూడా ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు-నమ్రత కలిసి 'వంశీ' అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడటం, కొంతకాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత ముంబైలో ప్రేమ వివాహం చేసుకున్నారన్నది అందరికీ తెలిసిందే.

స్లైడ్ షోలో సినిమాలో నమ్రత రోల్ కు సంబంధించిన మరిన్ని విశేషాలు..

పెళ్లి తర్వాత

పెళ్లి తర్వాత

పెళ్లి తర్వాత న్రమత ఎప్పుడూ కెమెరా ముందుకు రాలేదు, ఎందులోనూ నటించలేదు. పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలు, మహేష్ ప్రాజెక్టులకు సంబంధించిన బాధ్యతలు, ఈ మధ్య కాలంలో కొత్తగా తమ సొంతబేనర్ పనులు చూసుకుంటూ ఎప్పుడూ నమ్రత ఫుల్ బిజీ.

లాంగ్ గ్యాప్ తర్వాత

లాంగ్ గ్యాప్ తర్వాత

చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ నమ్రత సినిమాల్లో నటిస్తుందనే వార్తలు ఈ సినిమా పట్ల అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపాయి.

సెకండ్ హీరోయిన్?

సెకండ్ హీరోయిన్?

సినిమాలో మెయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అయితే సినిమాలో గెస్ట్ హీరోయిన్ (సెకండ్)పాత్ర కూడా ఉంటుందని, అందులో నమ్రత నటిస్తోందని అంటున్నారు.

మహేష్ ఓకే

మహేష్ ఓకే

ఈ విషయం ఇటీవలే దర్శకుడు మహేష్ బాబుకు చెప్పాడని, నమ్రత ఓకే అంటే తనకు అభ్యంతరం లేదని చెప్పాడట మహేష్ చెప్పినట్లు సమాచారం.

నమ్రత కూడా..

నమ్రత కూడా..

నటించేది భర్త పక్కనే కాబట్టి... చాలా కాలం తర్వాత కెమెరా ముందుకు వచ్చే అవకాశం దక్కింది కాబట్టి నమ్రత కూడా ఓకే చెప్పిందట.

 గ్లామర్ కు మెురుగులు

గ్లామర్ కు మెురుగులు

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా నమ్రత గ్లామర్ విషయంలో గానీ, పర్సనాలిటీ మెయింటనెన్స్ విషయంలోగానీ మహేష్ బాబుతో పోటీ పడే రేంజిలో లేదు. ప్రస్తుతం సినిమాలో కనిపించాలి కాబట్టి తన అందానికి మెరుగులు దిద్దుకోవడంతో పాటు, ఫిజిక్ తగ్గించుకునే పనిలో ఉందట.

ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటించబోతున్నాడు.

వంద కోట్లు

వంద కోట్లు

ఈ సినిమాను దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్నారు. డిసెంబరు కల్లా షూటింగ్ పూర్తి చేస్తారని, పొంగల్ నాటికి ఇది రిలీజ్ కావచ్చునని అంటున్నారు.

English summary
Mahesh Babu's upcoming film with director AR Murugadoss has finally gone on floors. The bilingual actioner will have SJ Suryah locking horns with Mahesh Babu. Film Nagar source said that Namrata shirodkar guest role in this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu