For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫోటో షూట్ లో సరికొత్తగా దర్శనమిచ్చిన నమ్రత.. మహేష్ బాబు ఏమన్నాడంటే?

  |

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన సతీమణి కూడా అదే తరహాలో కనిపిస్తారు. తన కెరీర్ మూడవ సినిమాగా వచ్చిన వంశీ మూవీతో పరిచయమైన నమ్రత శిరోద్కర్ ని మహేష్ ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

  పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం మొదట పలువురు టాలీవుడ్ హీరోయిన్స్ ని పరిశీలించిన అనంతరం బాలీవుడ్ కి చెందిన నమ్రత శిరోద్కర్ ని ఎంపిక చేశారు.

  హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...

  ఆ విధంగా కలిసిన జంట

  ఆ విధంగా కలిసిన జంట

  అయితే ఆ తరువాత సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వడం, అనంతరం షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేష్, నమ్రత ఇద్దరూ కూడా ప్రేమతో మరింత క్లోజ్ అయ్యారు. ప్రేమలో పడడం, ఆపై 2005 లో ఇరు కుటుంబాలని ఒప్పించి వివాహం చేసుకోవడం జరిగింది.

  ప్రస్తుతం ఈ ఇద్దరు దంపతులు తమ ముద్దుల బిడ్డలు గౌతమ్, సితారలతో కలిసి హ్యాపీ గా లైఫ్ ని కొనసాగిస్తున్నారు. ఇక ప్రస్తుతం తన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట షూట్ లో పాల్గొంటున్న సూపర్ స్టార్ మహేష్, ఆ మూవీ మూడవ షెడ్యూల్ గోవా లో జరుగగా, తన ఫ్యామిలీని కూడా తీసుకు వెళ్ళాడు.

  Mega Star with Sport Stars.. చిరంజీవితో మీరెప్పుడూ చూడని లెజెండ్స్ ఫోటోలు!

  గోవా షూటింగ్ లో సరదాగా

  గోవా షూటింగ్ లో సరదాగా

  వాళ్ళతో కలిసి గోవా వెళ్ళిన సూపర్ స్టార్ అక్కడే సరదాగా గడిపారు. అయితే ఇటీవల అక్కడి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకున్న అనంతరం రెండు రోజుల క్రితం సర్కారు వారి పాట టీమ్ తో పాటు మహేష్ ఫ్యామిలీ కూడా హైదరాబాద్ చేరుకుంది. ఇక మొదటి నుండి మహేష్ తో పాటు నమ్రత కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎన్నో సంగతులను ఘట్టమనేని అభిమానులతో పాటు పలువురు ప్రేక్షకులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

  సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ బ్యూటీఫుల్ ఫొటోస్.. ఆ స్మైల్ కు ఫిదా అవ్వాల్సిందే!

  నమ్రత శిరోద్కర్ ఫోటో షూట్

  నమ్రత శిరోద్కర్ ఫోటో షూట్

  అసలు విషయంలోకి వెళితే సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో ఫోటో షూట్ చేసిన ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్, ఇటీవల గోవాలో జరిగిన సర్కారు వారి పాట షెడ్యూల్ లో కూడా నమ్రత శిరోద్కర్ తో ఒక ప్రత్యేక ఫోటో షూట్ నిర్వహించారు. ఇక ఆ ఫోటోలను నేడు ఉదయం తన సోషల్ మీడియా అకౌంట్స్ పోస్ట్ చేసారు. చిన్నూ అక్క మీరంటే నాకు ఎంతో అభిమానం ఇష్టం, మీరు ఎల్లప్పుడూ బాగుండాలి, ఈ పిక్స్ నేను ఇప్పటివరకు తీసిన అద్భుతమైన పిక్స్ లో ఒకటి అంటూ అవినాష్ పోస్ట్ చేయగా అవి నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి.

  Shruti Hassan : పదిహేడేళ్ళప్పుడు ఎలా ఉందో చూశారా?

  మహేష్ కామెంట్స్

  మహేష్ కామెంట్స్

  ఈ ఫోటోస్ కి రిప్లై ఇచ్చిన నమ్రత.. ఆ రోజున ఏదో సరదాగా మహేష్ జాకెట్ ని తీసుకుని మేకప్ లేకుండా దిగిన ఈ ఫోటోలు ఇంత అద్భుతంగా మీరు క్యాప్చర్ చేస్తారని ఊహించలేదు బ్రదర్ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా సమాధానం ఇచ్చారు. అయితే కొద్దిసేపటి తరువాత మహేష్ కూడా ఆ పిక్ పర్ఫెక్ట్ గా ఉంది అంటూ రీట్వీట్ చేయడం విశేషం. ప్రస్తుతం నమ్రత ఫొటోలు అయితే సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి.

  English summary
  Namrata Shirodkar latest photo shoot and mahesh comments..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X