Don't Miss!
- News
హిందూపురంలో బాలకృష్ణ అవుట్- తారక్ ఇన్: జోరుగా మంతనాలు..!!
- Finance
BharOS: అండ్రాయిడ్, IOS లకు షాకిస్తున్న BharOS
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
నమ్రత కొత్త హోటల్ లో షాక్ ఇస్తున్న రేట్లు.. పునుగులే రూ.125, మిగతా రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడక్షన్ లోనే కాకుండా ఇతర వ్యాపారాలలో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల మొదటిసారి నమ్రత ద్వారా ఒక కొత్త కాఫీ షాప్ బిజినెస్ను స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా దాన్ని లాంచ్ కూడా చేశారు. అయితే అందులో ఉన్న రేట్లు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే అని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్స్ వెలబడుతున్నాయి. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మినర్వా కాఫీ షాప్
ఇటీవల హైదరాబాదులో జూబ్లీహిల్స్ దగ్గర నమ్రత శిరోద్కర్ తన కొత్త ప్యాలెస్ హైట్స్ అనే మినర్వా కాఫీ షాప్ ను ప్రారంభించారు. ఇందులో ఏషియన్ సినిమాస్ సునీల్ వారు కూడా భాగస్వామ్యలుగా ఉన్నారు. నమ్రత ప్రత్యేకంగా ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ హోటల్ ను ప్రారంభించడం జరిగింది. సోషల్ మీడియాలో హోటల్ కు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

వివిధ రకాల ఐటమ్స్
అయితే ఇది పేరుకు కాఫీ షాప్ అయినప్పటికీ కూడా ఇందులో స్నాక్స్ అలాగే చైనీస్ ఫుడ్స్ వివిధ రకాల ఐటమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా టిఫిన్స్ స్టాటర్స్ ఇందులో మెయిన్ హైలెట్ అని అర్థమవుతుంది. ఇక హై ఏరియాలో దీన్ని స్థాపించడం వలన రేట్లు కూడా అక్కడికి వారి రేంజ్ కు తగ్గట్టుగానే ఉన్నట్లుగా అర్థమవుతుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం వివిధ రకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి.

షాకింగ్ రేట్లు
ముఖ్యంగా సాధారణ టిఫిన్లు మాత్రం ఊహించని రేంజ్ లోనే ఉన్నాయి. రెగ్యులర్ టిఫిన్స్ లలో ఇడ్లీలు అయితే ఒక ప్లేట్ 90 రూపాయలు ఉండగా ఆ తర్వాత వివిధ రకాల ఇడ్లీలు 120 రూపాయల నుంచి 190 వరకు ఉన్నాయ. ఇక మరికొన్ని స్టార్టర్స్ అయితే 390 రేంజ్ లో కూడా ఉన్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా పునుగులు ఆలూ బజ్జీలు మిర్చి బజ్జీలు ఇవన్నీ కూడా 125 రూపాయల పై గానే ఉండడంతో సోషల్ మీడియాలో మెన్యుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

అలాంటి కామెంట్స్ కూడా..
కేవలం ఈ కాఫీ షాప్ రిచ్ కిడ్స్ కు మాత్రమే సరిపోతుంది అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మెయిన్ సిటీలో ఉన్న చాలా రెస్టారెంట్లలో ఇదే తరహాలో రేట్లు ఉన్నాయి అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బెంగుళూరు సిటీలో అయితే రేట్లు దాదాపు ఇదే రేంజ్ లో ఉన్నాయని కప్పు కాఫీకి కూడా వందల రూపాయల ఛార్జ్ చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు.

చాలా తెలివిగా పెట్టబడులు
ఇక మినర్వా కాఫీ షాప్ ను నమ్రత గారితో పాటు ఏషియన్ సునీల్ భాగస్వామ్యంలో కొనసాగుతోంది. ఇక త్వరలోనే హైదరాబాదులోని వివిధ రకాల ప్రదేశాల్లో వీటిని స్థాపించాలని అనుకుంటున్నారు. మహేష్ బాబు కంటే కూడా నమ్రత వ్యాపారాలలో చాలా తెలివిగా పెట్టబడులు పెడుతుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇప్పటికే వీరి ఏషియన్ సినిమాస్ కూడా మంచి ప్రాఫిట్ లో కొనసాగుతోంది. మరి రాబోయే రోజుల్లో నమ్రత ఇంకా ఎలాంటి బిజినెస్ లో పెట్టుబడులు పెడుతుందో చూడాలి.