Mahesh babu or Gautham: క్రేజీగా తండ్రి కొడుకులు.. వైరల్‌గా నమ్రత షేర్ చేసిన ఫొటో
మహేష్ బాబుకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ కావాలి అంటే నమ్రత శిరోద్కర్ ను ఫాలో అయితే సరిపోతుంది. అభిమానులందరికి ఇది తెలియని విషయమేమీ కాదు. మహేష్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే నమ్రత తన ఇద్దరు పిల్లల్ని కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక ఇటీవల ఒక ఫొటో పోస్ట్ చేసిన నమ్రత అభిమానులను కన్ఫ్యూజన్ లో పడేసింది. పేరు చూసిన తరువాత గాని ఫ్యాన్స్ కు సరిగ్గా అర్థం కాలేదు.

బెస్ట్ హీరోగానే కాకుండా
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన కుటుంబ సభ్యులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడు. షూటింగ్ కు కాస్త గ్యాప్ దొరికినా కూడా వాళ్ళతోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతుంటాడు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ హీరోగానే కాకుండా బెస్ట్ డాడీగా కూడా మహేష్ ఎప్పుడో క్రేజ్ అందుకున్నాడు.

బాబు అలా.. పాప ఇలా..
ఇక మహేష్ పిల్లలకు ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉన్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే చిన్న బాబు గౌతమ్ సోషల్ మీడియాలో అస్సలు కనిపించడు. వీలైనంత వరకు ప్రయివేట్ లైఫ్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. ఇక సీతారా పాప మాత్రం అలా కాకుండా నెటిజన్లను ఎదో ఒక విధంగా ఆకట్టుకుంటు ఉంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో భారీగా క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.
ఆద్యతో కలిసి..
ఫొటో షూట్స్ తో పాటు యూ టూబ్ ఛానెల్ ద్వారా కూడా సితార అభిమానులకు మరింత దగ్గరయ్యింది. వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఎన్నో రకాల యూ ట్యూబ్ వీడియోలు చేసింది. ఆఖరికి తండ్రిని కూడా పలు సందర్భాల్లో ఇంటర్వ్యూ చేసింది. ఇక ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫొటో షూట్స్ కూడా చేస్తూ ఫాలోవర్స్ సంఖ్యను మరింత ఓఎంచుకుంటోంది.

గౌతమ్?.. మహేష్ బాబు..
అయితే ఇటీవల నమ్రత ఒక ఫొటో పోస్ట్ చేయగా అభిమానులు కాస్త కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. అందులో ఉన్నది మహేష్ బాబునా లేక గౌతమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గౌతమ్ కూడా దాదాపు మహేష్ బాబు హైట్ ను అందుకోవడంతో దగ్గరనుంచి చూస్తే గాని ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు. మహేష్ కూడా ఆ రేంజ్ లో ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు.
Recommended Video

ప్రేమగా హద్దుకున్న మహేష్
ఇక అందులో ఉన్నది మహేష్ అని నమ్రత ట్యాగ్ చేయడం ద్వారా నెటిజన్లకు ఒక క్లారిటీ వచ్చేసింది. పెంపుడు కుక్కను ప్రేమగా హద్దుకున్న మహేష్ న్యూ హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సర్కారు వారి పాట కోసం మహేష్ ఆ విధంగా సిద్దమైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.


Click it and Unblock the Notifications











