»   » మహేష్ షూటింగ్ కి ఫోన్ తీసుకెళ్లడు...అందుకే

మహేష్ షూటింగ్ కి ఫోన్ తీసుకెళ్లడు...అందుకే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మొదటి నుంచీ మహేష్ బాబు కెరీర్ విషయాల్లో తన బార్య నమ్రతా సూచనలు,సలహాలు తీసుకుంటాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అటువంటిదేమీ లేదని నమ్రత తేల్చి చెప్పింది. అటువంటి రూమర్స్ పుట్టడానికి కారణం మహేష్ తన షూటింగ్ లొకేషన్ కి ఫోన్ తీసుకు వెళ్లకపోవటమే అని చెప్పారామె. ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ ఈ విషయాలని చెప్పారామె.

Namrata talks about Mahesh Babu

నమ్రత మాట్లాడుతూ... మహేష్ మొదటినుంచీ సిగ్గు ఎక్కువ. తన చిత్రాల షూటింగ్ లొకేషన్‌కి ఫోన్ తీసుకెళ్లడు. దాంతో తననెవరైనా కాంటాక్ట్ చేయాలంటే నాకు ఫోన్ చేస్తారు. దానివల్ల తనకు సంబంధించిన అన్నింట్లోనూ నా జోక్యం ఎక్కువ ఉంటుందని భావిస్తారు. సినిమాలపరంగా నిర్ణయాలన్నీ తనవే. సొంత నిర్ణయాలు తీసుకునే ఈ స్థాయికి ఎదిగాడు అన్నారామె.

ఇక తాను మహేష్ కు అభిమానని అని చెప్పారామె. ప్రస్తుతం పరిశ్రమలో తనంత ప్రతిభ ఉన్నవాళ్లు కానీ తనకన్నా మెరుగైనవాళ్లు కానీ లేరని తన ఫీలింగ్ అని చెప్పారామె. అలాగే మహేష్ ఈ రోజు ఈ స్ధాయికి చేరుకోవటం తనకు చాలా గర్వంగా ఉంది అన్నారామె. మొదట్లో తన తండ్రి సపోర్టు తీసుకున్నా తర్వాత తనంతట తానే కష్టపడి ఈ స్ధాయికి వచ్చానని చెప్పారు. ఏ నిర్ణయమైనా మహేష్ స్వయంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారామె.

English summary

 Namrata says..." People think I am involved in everything Mahesh does, only because he is not so accessible. He is a shy person, he doesn't carry his phone to the sets. So, those who want to reach him, end up speaking to me. But how he's shaped his career, the choices he's made, are all his own."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu