»   » మహేష్ బాబు కోసం షాపింగ్ చేసేది ఎవరో తెలుసా?

మహేష్ బాబు కోసం షాపింగ్ చేసేది ఎవరో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు ఎంత బిజీనో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు సినిమాలు, యాడ్ ఫిల్మ్స్ తో బిజీగా ఉండే మహేష్ బాబు పూర్తిగా ప్రైవేట్ లైఫ్ గడుపుతుంటాడు. ఆయన ఉంటే షూటింగులో లేదా ఫ్యామిలీతో తప్ప మరెక్కడా ఎక్కువగా కనిపించరు. మహేష్ బాబు ప్రొఫెషనల్‌గా ఫుల్ బిజీగా ఉంటే, ఇల్లు, పిల్లలకు సంబంధించిన వ్యవహారాలు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ చూసుకుంటారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నమ్రత శిరోద్కర్ మహష్ బాబు గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చాలా బిజీగా ఉండే మహేష్ బాబు తనకు కావాల్సిన వస్తువులు కొనే సమయం కూడా ఉండదని తెలిపింది. మహేష్ కు నా కోసం షాపింగ్ చేసే సమయం ఉండదు. ఎందుకు కంటే ఆయన కోసం కూడా షాపింగ్ చేసుకోలేనంత బిజీ. అందుకే ఆయనకు కావాల్సిన దుస్తులు, ఇతర వస్తువుల విషయంలో నేనే షాపింగ్ చేస్తాను. దుబాయ్, అమెరికాలో షాపింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను అని నమ్రత చెప్పుకొచ్చారు.

 Namrata Will Shop For Mahesh Babu

సినిమాలతో బిజీగా ఉండే మహేష్ బాబు పని ఒత్తిడి నుండి ఉప శమనం పొందడానికి రెండు మూడు నెలలకు ఒకసారి విదేశీ యాత్రలకు వెళతారు. పిల్లలతో మహేష్ బాబు చాలా క్లోజ్ గా ఉంటారు. ఆయన ఇతర స్టార్లలా కాదు. ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడతారు. గౌతం, సితారలతో ఆడుకోవడం అంటే ఆయనకు ఇష్టం అని నమ్రత తెలిపారు.

భవిష్యత్తులో మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు నమ్రత స్పందిస్తూ...అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని నమ్రత స్పష్టం చేసారు. ప్రస్తుతం తాను కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నానంటూ నమ్రత శిరోద్కర్ చెప్పుకొచ్చారు.

English summary
Namrata recently opens her heart and spoke length about her husband. Namrata shared that being a busy person Mahesh will not get time to shop for himself. Namrata says, "Mahesh doesn't have time to shop for me. I don't expect him to shop for me as he was very busy person. In fact, I only do shop for him and I love Dubai, America to shop.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu