»   » గౌతమ్‌కు షూటింగ్ సమయంలో... :నమ్రత

గౌతమ్‌కు షూటింగ్ సమయంలో... :నమ్రత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గౌతమ్‌కు ఇప్పుడు ఏడేళ్లు.. తొలిసారి ఓ చిత్రంలో వాడు ఆరంగేట్రం చేస్తున్నాడు.. షూటింగ్‌ సమయంలో వాడికి నేనెప్పుడూ తోడుగా ఉంటాను.. వాడికి కావల్సిన ప్రోత్సాహాన్ని అందిస్తుంటానని ప్రిన్స్‌ మహేష్‌బాబు సతీమణి నటి నమ్రతా శిరోద్కర్‌ అన్నారు. బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో హైదరాబాద్‌ చిల్డ్రన్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ నాలుగో ఎడిషన్‌ను ఆమె ప్రారంభిస్తూ చెప్పారు.

నమ్రత మాట్లాడుతూ... పిల్లలకు కొత్త అంశాలపై ఉండే ఆసక్తిని గుర్తించాలి. జీవితంలో విభిన్నంగా రాణించేలా ప్రోత్సహించాలి. తమ పిల్లలు గౌతమ్‌, సితార విషయంలో తమ ప్రోత్సాహం కచ్చితంగా ఉంటుందన్నారు. ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ డైరక్టర్‌ సుబాష్‌ మాట్లాడుతూ చాలా మంది పిల్లలు ఇప్పుడు థియేటర్‌ ఆర్ట్‌పై ఆసక్తి చూపడం లేదన్నారు. సురభికి 150 ఏళ్ల చరిత్ర ఉందని రంగుల ప్రపంచాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్పటి నుంచే వారు చూపించారన్నారు. ఇక వైశాలి బిప్త్‌ థియేటర్‌ వర్క్‌షాప్‌ మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ఈ నెల 28 నుంచి 30 వరకు కొనసాగుతుందని నిర్వాహకురాలు బిప్త్‌ తెలిపారు.

Namratha about her son Goutham

ఇక ఇండియాలోనే బెస్ట్ యాక్టర్..ప్రపంచంలోనే బెస్ట్ డాడ్ మహేష్...ఈ మాటలంటున్నది మరెవరో కాదు మహేష్ బాబు సతీమణి ఘట్టమనేని నమ్రత. ఆమె తన భర్త (మహేష్ బాబు) గురించి చెబుతూ..ఓ యాక్టర్ గా నేను అనుకునేది ఇండియాలో బెస్ట్ యాక్టర్స్ లో ఒకరని. నేను ఇండియాలోనే ఎందుకని చెప్తున్నానంటే నేను అలా ఫీలవుతూ గర్వపడుతూంటాను కాబట్టి. అతను గొప్ప నటుడు. అలాగే తన క్రాఫ్ట్ కి కమిట్ అయి ఉండే వ్యక్తి. ఇక భర్తగా అంటారా..అతను నమ్మశక్యం కానంత ప్రేమతో మాతో మెలుగుతారు.

మేం బెస్ట్ ప్రెండ్స్ మి. అతనితో పరిచయం, పెళ్ళి నా జీవితంలో జరిగిన బెస్ట్ ధింగ్స్. నేను నా జీవితంలో ఆనందకరమైన ఫేజ్ లో ఉన్నాను. ఇంకా చెప్పాల్సిందేమైనా ఉందా. ఇక మహేష్ తండ్రిగా చెప్పాలంటే..నాకు తెలిసి ప్రపంచంలోనే బెస్ట్ డాడ్ అని నేనూ గౌతమ్ (మహేష్ కొడుకు) ఫీలవుతూంటాము. గౌతమ్ కి ఐడిల్..మహేషే. ప్రొద్దునే లేచి గౌతమ్ నవ్వుని చూడటం కన్నా మహేష్ కి ఆనందాన్ని ఇచ్చే అంశం వేరేది లేదు అంటూ గతంలో చెప్పుకొచ్చారామె.

English summary
Mahesh Babu wife Namrata Shirodkar says that she is happy with her son Goutham.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu