»   » అల్లు అర్జున్ 'బద్రీనాథ్‌' లో నానా పటేకర్

అల్లు అర్జున్ 'బద్రీనాథ్‌' లో నానా పటేకర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వివి వినాయక్‌ దర్శకత్వం అల్లు అర్జున్‌ హీరోగా రూపొందనున్న 'బద్రీనాథ్‌' చిత్రంలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ని ఓ కీలక పాత్రలో తీసుకుంటున్నారు. ఈ మేరకు నానాని కలిసి ఎగ్రిమెంట్ చేయించుకున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ పాత్రకు మోటివేటర్ గా ఆ పాత్ర ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్‌ సంస్థ పై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. మే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభంకానుంది. అలాగే ఈ చిత్రంలో ఫైట్స్ కోసం అల్లు అర్జున్...ప్రత్యేక శిక్షణ తీసుకోబోతున్నారు. బ్యాంకాక్ లో పాపులర్ అయిన ఓ పోరాట కళను ఇక్కడ ప్రేక్షకులకు పరిచయం చేస్తే విభినన్నంగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకోసం అల్లు అర్జున్ కొద్ది రోజులు పాటు బ్యాంకాక్‌ లో శిక్షణ తీసుకోనున్నారు. అలాగే ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తారు. 'మగధీర' చిత్రానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించిన కమల్‌ కన్నన్‌ ఈ 'బద్రీనాథ్‌' కి ఎఫెక్ట్స్ అందిస్తారు. అలాగే 'అపరిచితుడు', 'రాఘవన్‌', 'దశావతారం' చిత్రాలకు పని చేసిన కెమెరామెన్ రవి వర్మన్‌ ని ఛాయాగ్రాహకుడిగా ఎంచుకున్నారు. వీటికి తోడు నరసింహనాయుడు, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన చిన్నికృష్ణ గ్యాప్ తర్వాత అందిస్తున్న కథ ఇది. ఇలా సినిమా ప్రారంభం స్దాయినుంచీ క్రేజ్ తెచ్చేందుకు వివివినాయిక్, అల్లు అర్జున్ వ్యూహాత్మకంగా వ్యవహిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్ లో రెడీ అయిన 'వరుడు' ఈ నెల 26న విడుదల అవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu