»   » అభిమానుల లెక్కలో ఏ హీరో నాకు సమానం కాదు: బాలకృష్ణ

అభిమానుల లెక్కలో ఏ హీరో నాకు సమానం కాదు: బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఈచిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై దూసుకుపోతోంది. ఆ ఆనందంలో ఈ సినిమాకి దర్శకత్వం వహించిన క్రిష్‌, బృందం అమెరికా వెళ్లింది.. .. ఇప్పటి వరకు బాలయ్య మూవీలు ఏవీ కూడ మిలియన్‌ డాలర్‌ క్లబ్‌లో చేరలేదు. అయితే ఆ లోటను ఈచిత్రం తీర్చింది.. అమెరికాలో ఈ మూవీ సూపర్‌హిట్‌ కావటంతో అక్కడి ప్రేక్షకుల సమక్షంలో సక్సెస్‌మీట్‌ జరిపేందుకు శాతకర్ణి యూనిట్‌ బుధవారం అమెరికాకు వెల్లిన సంగతి తెలిసిందే... వీరి పర్యటన శాతకర్ణి కలెక్షన్లను మరింత ముందుకు తీసుకెళ్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు అక్కడ బాలయ్య చేసిన వ్యాఖ్య మిగతా టాలీవుడ్ హీరోలకి చిన్న షాక్ ఇచ్చింది. ఇంతకీ అక్కడ బాలయ్య అన్న మాట ఏమిటో తెలుసా.. ఏ హీరోకు లేనంత మంది అభిమానులు తనకున్నారని చెప్పాడు. ''అభిమానులే నా బలం. నాకున్నంత మంది అభిమానులు తెలుగులో ఏ హీరోకు కూడా లేరు.

Nandamuri Balakrishna FANS Worldwide

ఇతర హీరోలకు భారీ అభిమాన గణమే ఉండి ఉండొచ్చు. కానీ, నా అభిమానులుగా రిజిస్టరైనంత మంది మాత్రం లేరు. నా అభిమానులతో పోలిస్తే వారికున్న అభిమానుల లెక్క సరితూగదు. మొత్తంగా నాకు 4,500 రిజిస్టర్డ్ ఫ్యాన్స్ క్లబ్బులు ఉన్నాయి. ఏ ఇతర హీరోకు అన్ని క్లబ్బులు లేవు.

అమెరికాలో పర్యటిస్తున్నంతసేపూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టే ఉంది. అమెరికాలో సెటిలైన తెలుగు వాళ్లందరూ నా మీద ప్రేమానురాగాలను చూపించారు'' అంటూ ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ అన్నాడు. మరి, బాలయ్య మాటలను మిగతా టాలీవుడ్ హీరోలు ఒప్పుకుంటారా... లేదంటే మ్ళ్ళీ సమయం వచ్చినప్పుడు ఏదైనా సెటైర్ వేస్తారా అన్నది చూడాలి...

English summary
Speaking to a TV Channel during his current US Tour, Balakrishna claimed That "My Fans are my strength. No other Hero have as many fans as that of mine. May be, Other Actors might have a huge fan base but can't match up with the registered Fans of mine"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu