Just In
- 36 min ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 1 hr ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 10 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
- 11 hrs ago
అభిమాని పెళ్లిలో సడన్‌గా ప్రత్యక్షమైన స్టార్ హీరో.. అతిధులంతా షాక్!
Don't Miss!
- Sports
ISL 2020 21: చెన్నయిన్ X ముంబై మ్యాచ్ డ్రా
- News
రిపబ్లిక్ డే : ఏపీ లేపాక్షి,యూపీ రామ మందిర శకటాలు.. ఈసారి ఢిల్లీ పరేడ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్స్ ఇవే
- Automobiles
ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అరె! బాలకృష్ణ ఇలా మారిపోయాడేంటి? గుండుతో నందమూరి నటసింహం..
నందమూరి నటసింహం బాలకృష్ణ కొత్త రూపం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రూలర్ సినిమా తర్వాత కెమెరా కంట్లో పడని బాలయ్యబాబు ఇలా సడెన్‌గా షాకింగ్ లుక్‌లో కనిపించారు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు బాలయ్య కొత్త అవతారం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..

గుండు, బుర్ర మీసాలతో బాలయ్య
తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి బాలకృష్ణ హాజరైన ఇలా కెమెరాకు చిక్కారు. గుండు గీయించుకుని, బుర్ర మీసాలతో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్‌గా నిలిచారు బాలయ్య బాబు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బాలయ్య ఇలా కనిపించడంతో ఈ లుక్ ఎందుకోసం అనే దానిపై చర్చలు ముదిరాయి.

చంద్రబాబు సమావేశం.. వెలుగులోకి బాలకృష్ణ న్యూ లుక్
సోమవారం ఆరంభమైన శాసనసభ ప్రత్యేక సమావేశాలను దృష్టిలో ఉంచుకుని.. తెలుగుదేశం పార్టీ సభాపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి బాలకృష్ణ హాజరయ్యారు. దీంతో ఆయన న్యూ లుక్ వెలుగులోకి వచ్చింది. కొత్త, కొత్తగా కనిపించిన బాలకృష్ణను తోటి ఎమ్మెల్యేలు పలకరించారు. ఈ మేరకు ఆయన కొత్త అవతారం గురించి ఆరా దీశారు.

పూర్తి భిన్నంగా తాజా గెటప్.. గతంతో పోల్చితే
బాలకృష్ణ గత సినిమా 'రూలర్' లో ట్రిమ్‌గా యంగ్ లుక్ లో కనిపించిన ఆయన ఒక్కసారిగా ఇలా మారిపోవడం చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. గతంతో పోల్చితే తాజా గెటప్ పూర్తి భిన్నంగా ఉంది. దీంతో ఈ లుక్ బాలకృష్ణ తదుపరి సినిమా కోసమే అని, ఆయన నెక్స్ట్ ప్రాజెక్టులో ఇలానే కనిపించనున్నారని టాక్ మొదలైంది.

బాలయ్య లుక్‌పై బోయపాటి ఫోకస్
రూలర్ సినిమాతో ఆశించిన మేర ఫలితం రాబట్టని బాలకృష్ణ.. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టు చేయబోతున్నారు. ఇందులో బాలయ్య లుక్ పై బోయపాటి ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి. అందుకే ఈ తాజా లుక్ చూసి నందమూరి నటసింహం గెటప్ ఇదేనంటూ చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు.

బాలయ్య 106.. డైరెక్టర్ బోయపాటి
బాలయ్య 106వ సినిమాగా బోయపాటి దర్శకత్వంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిననున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నాడు. బాలయ్య సరసన హీరోయిన్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.