Just In
Don't Miss!
- Sports
India vs England: 'టీమిండియాలో ఎందుకు లేవని ప్రశ్నించేవాళ్లు.. ఆ మాటలు నిత్యం గుర్తుకొచ్చేవి'
- News
ప్రముఖ రచయిత వేల్చేరు నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం...
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆయనే పోలీసుల రూపంలో వచ్చి.. దిశా ఎన్‌కౌంటర్‌పై బాలకృష్ణ రియాక్షన్
దిశా నిందితులు నలుగురినీ ఈ రోజు (డిసెంబర్ 6) తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో గత పది రోజులుగా దిశగా నిందితులను చంపేయాలంటూ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్స్‌కి తెరపడింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ పోలీసుల పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దిశా ఘటన.. ఉలిక్కిపడ్డ జనం
నవంబర్ నెల 27వ తేదీన షాద్ నగర్ సమీపంలో దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఉదంతం యావత్ భారత దేశాన్ని కలచివేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో దిశ ఘటనలో నిందితులైన ఆ నలుగురినీ బహిరంగంగా చంపేయాలని అంతా నినదించారు.

తప్పించుకునేందుకు ప్రయత్నం.. ఎన్‌కౌంటర్
ఈ పరిస్థితుల నడుమ దిశ హత్య కేసులో నిందితులైన నలుగురినీ నేడు (డిసెంబర్ 6) తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య ఎన్‌కౌంటర్ చేశారు షాద్ నగర్ పోలీసులు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడంతో ఆ నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం జరిగింది.

పోలీసులు, గవర్నమెంట్‌పై బాలకృష్ణ కామెంట్
ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బోయపాటితో తన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ దిశా ఎన్‌కౌంటర్ పై మీడియా ముఖంగా స్పందించారు. ఈ మేరకు తెలంగాణ గవర్నమెంట్, పోలీసుల పనితీరుపై కామెంట్స్ చేశారు.

అతనే పోలీసుల రూపంలో వచ్చి..
కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని అంటారు.. అలాగే ఈ రోజు తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్ భగవంతుడు పోలీసుల రూపంలో వచ్చి చేయవలసిన పనిని చేసి వెళ్లారని నమ్ముతున్నానని బాలయ్య పేర్కొన్నారు. ఇది చూసైనా మళ్లీ ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడాలి అని బాలకృష్ణ అన్నారు.
|
ఓ ఆడబిడ్డకు న్యాయం
దిశా కేసులో నిందితులైన ఈ నలుగురి ఎన్‌కౌంటర్‌తో ఓ ఆడబిడ్డకు న్యాయం జరిగిందని బాలకృష్ణ అన్నారు. దిశ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఈ సందర్బంగా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ పోలీసులకు నా కృతజ్ఞతలు అని బాల్లయ్యబాబు చెప్పారు.