»   » మళ్ళీ కొట్టాడు: కార్య కర్తని ఈడ్చి కొట్టిన బాలయ్య

మళ్ళీ కొట్టాడు: కార్య కర్తని ఈడ్చి కొట్టిన బాలయ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu
Balakrishna slapped a fan during an Rally at Hindupur in AP ఈడ్చి కొట్టిన బాలయ్య..!

టీడీపీ నేత, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి తన 'చేతివాటం' ప్రదర్శించారు. ఇటీవల తన అసిస్టెంట్‌ను, దండవేయటానికి వచ్చిన ఒక అభిమానినీ కొట్టి పతాక శీర్షికలకు ఎక్కిన ఆయన తాజాగా మరొకరిపై చేయి చేసుకున్నారు. టీడీపీ కార్యకర్త అయిన తన అభిమాని చెంప చెళ్లుమనిపించారు. పాపం బాలయ్యకి ఒక్క అడుగుముందు నడుద్దాం అనుకున్న ఆ అమాయక అభిమానీ అలియాస్ కార్యకర్త తలమీద బాలయ్య చేతిలో ఎప్పట్లాగే "ప్రేమగా, ముద్దుగా ఓ మొట్టికాయ వేసాడు.

Nandamuri Balakrishna Slaps His Fan At Hindupur

హిందూపురంలోని బోయపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ ఇంట్లోకి వెళుతుండగా.. బాలయ్య కంటే ముందు ఓ కార్యకర్త వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో బాలయ్య అసహనంతో ఆ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. ఎందుకంత తొందరంటూ వారించారు.
Nandamuri Balakrishna Slaps His Fan At Hindupur

గతంలో కూడా ఆయనతో పాటు సెల్ఫీ దిగడానికి వచ్చిన ఓ అభిమానిపై బాలయ్య చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. నంద్యాలలో కార్యకర్తలు గజమాల వేస్తున్న క్రమంలో ఓ కార్యకర్త బాలయ్యపైకి దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో ఆయన ఆ కార్యకర్తను వారించారు. ఇటీవల ప్రారంభమైన కేఎస్ రవికుమార్ సినిమా షూటింగ్‌లో కూడా బాలకృష్ణ అక్కడి అసిస్టెంట్‌పై అసహనం వ్యక్తం చేసి వార్తల్లో నిలిచిన విషయం విదితమే.
English summary
Nandamuri Balakrishna slapped a fan during an Rally at Hindupur in Kurnool district of Andhra Pradesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu