twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'తానా' ఎన్నికల్లో నిరంజన్‌ ప్యానెల్ ఘ‌న విజ‌యం.. నందమూరి బాలకృష్ణ స్పెషల్ విషెస్!

    |

    అమెరికాలో మన తెలుగు వారి సంఖ్య ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. యూఎస్ లో ఎక్కడికి వెళ్లినా కూడా ఎవరో ఒక తెలుగు వ్యక్తి కనిపించడం సర్వసాధారణం. అంతే కాకుండా అక్కడ అతిపెద్ద ఇండస్ట్రీలలో తెలుగువారి పాత్ర ఎంతో కీలకమనే చెప్పాలి. ఇక రీసెంట్ గా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికలు అట్టహాసంగా జరిగాయి. గెలిచిన వారికి నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

    ఓట్ల లెక్కింపు కూడా పూర్తయింది. ఈ ఎన్నికల్లో నిరంజన్‌ శృంగవరపు ప్యానెల్ ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. తానా అధ్యక్షుడిగా నిరంజన్ ఎన్నికవ్వడంతో తెలుగు రాష్ట్ర ప్రముఖులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందిస్తూ.. తప్పకుండా తానాకు సంబంధించిన సామాజిక, సాంస్కృతిక సేవా కార్యకలాపాలకు తమ మద్దతు ఉంటుందని బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.

    Nandamuri balakrishna special wishes to Usa Tana elections winners

    ఇక తానా ఎన్నికల ఫలితాల్లోకి వెళితే.. నిరంజన్‌కు 10,866 ఓట్లు రాగా, నరేన్‌ కొడాలికి 9,108 ఓట్లు వ‌చ్చాయి. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి కూడా నిరంజ‌న్ ప్యానెల్ అధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. ఇక చివరికి మంచి మెజారిటీతో గెలుపొందింది ప్యానెల్ లో ఆనందాన్ని నింపింది. నిరంజన్‌ ప్యానెల్‌ సభ్యులు గెలిచిన వెంటనే సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. తానా ప్ర‌స్తుత అధ్యక్షుడు జ‌యశేఖ‌ర్‌ తాళ్లూరి, అంజయ్య చౌదరిలు కూడా మొదటి నుంచి శృంగవరపు నిరంజన్‌కు సపోర్ట్ చేస్తూ వచ్చారు.

    English summary
    Needless to say, the range of our Telugu population in America is special. It is very common to see a Telugu person anywhere in the US. Apart from that, the role of Telugus in the biggest industries there is very crucial. Recently, the Telugu Association of North America (TANA) 2021 elections were held in Attahasa. Nandamuri Balakrishna specially congratulated the winners.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X