Murder Cases: బాలకృష్ణ నుంచి దర్శన్ వరకు.. మర్డర్, క్రిమినల్ కేసులో అరెస్ట్ అయిన సినీ తారలు ఎవరెవరంటే?
కన్నడ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడ అరెస్ట్ సంచలనం రేపింది. తన ప్రియురాలు పవిత్ర గౌడ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రేణుక స్వామి అనే యువకుడిని చావగొట్టినట్టు ఆరోపణలు వస్తున్న కేసులో ఈ ఇద్దరిని అరెస్ చేశారు. వారిని విచారణ నిమిత్తం 6 రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు. అయితే సినీ పరిశ్రమలో ఇలా హత్య, హత్యాయత్నం నేరాల్లో ఇరుక్కొన్న హీరోలు, నటుల వివరాల్లోకి వెళితే...
రాధిక శరత్ కుమార్ తండ్రి
తమిళ చిత్ర పరిశ్రమలో అప్పటి సూపర్ స్టార్ ఎంజీ రామచంద్రన్‌పై విలన్ పాత్రలు పోషించే ఎంఆర్ రాధా కాల్పుల ఘటన సంచలనం రేపింది. ఎంజీఆర్‌ను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించడంతో పెద్ద ముప్పు తప్పింది. ఆ తర్వాత ఎంఆర్ రాధాను క్షమించడంతో వారిద్దరు కలిసి నటించారు. ఎంఆర్ రాధా కుమార్తె ప్రస్తుత సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ అనే గమనార్హం.

ఎంజీఆర్‌పై తమిళ నటుడు హత్యా ప్రయత్నం
తమిళ నటుడు ఎంకే త్యాగరాజ భగవతార్ కూడా మర్డర్ కేసులో శిక్ష అనుభవించారు. 1944లో లక్ష్మీ కాంతన్ అనే వ్యక్తి హత్యకేసులో ముద్దాయిగా నిలిచారు. దాంతో మూడు సంవత్సరాలపాటు ఆయన జైలుశిక్షను అనుభవించారు. అరెస్ట్ తర్వాత ఆయన కెరీర్ కూడా అర్ధాంతరంగా ముగిసింది.

హీరో సుమన్‌కు జైలు శిక్ష
ఇక హీరో, సీనియర్ నటుడు సుమన్ కూడా తమిళనాడులో గుండా యాక్ట్, కిడ్నాప్ కేసులో జైలు శిక్ష అనుభవించారు. హీరోగా అద్బుతంగా రాణిస్తున్న సమయంలోనే ఆయన అరెస్ట్ అయ్యారు. చాలాకాలం జైలులోనే ఉన్నారు. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్లీ కెరీర్‌ను పట్టాలెక్కించి ఇప్పటికీ నటుడిగా కొనసాగుతున్నారు.

హత్య కేసులో నవజ్యోత్ సింగ్ సిద్దూ
క్రికెటర్, రియాలిటీ షోలో రాణించిన నవజ్యోత్ సింగ్ కూడా హత్యా కేసులో ఇరుక్కుపోయారు. ఓ అభిమాని తనతో దురుసుగా ప్రవర్తించడంతో చేజేసుకొన్నారు. ఆ సంఘటనలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి అనూహ్యంగా మరణించారు. ఈ ఘటన 1988 చోటు చేసుకొన్నది. అయితే కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షాకాలం తగ్గించమని వేడుకోవడంతో శిక్ష లేకుండా జరిమానా విధించింది.

రేప్ కేసులో మలయాళ సూపర్ స్టార్ దిలీప్
మలయాళంలో స్టార్ హీరోగా ఉన్న దిలీప్ కూడా హీరోయిన్‌పై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ కేసులో ఆయన పాత్ర నిరూపణ కావడంతో జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత సినిమా రంగంలో నిలదొక్కుకోలేకపోయారు. ఇంకా తన పూర్వ వైభవాన్ని దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ కాల్పుల ఘటనలో
ఇక నందమూరి బాలకృష్ణ కూడా హత్యాప్రయత్నం కేసులో ఇరుక్కోవడం సంచలనం రేపింది. నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్కుడిపై కాల్పులు జరిపిన ఘటనలో ఆయనపై కేసు నమోదు అయింది. అయితే ఎలాంటి శిక్ష పడకుండా ఆయన ఈ కేసు నుంచి బయటపడటంతో ఎలాంటి నష్టం జరగలేదు.

మర్డర్ కేసులో దర్శన్
ఇక తాజాగా తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపారనే కారణంతో తన అభిమాని రేణుక స్వామిని దర్శన్ అనుచరులు దారుణంగా కొట్టడంతో అతడు చనిపోవడం సంచలనం రేపింది. ఆ కేసులో దర్శన్, పవిత్ర గౌడను పోలీస్ అరెస్ట్ చేశారు. ఆయనను ఆరు రోజుల రిమాండ్ తరలించి విచారిస్తున్నారు.
డ్రగ్స్ కేసులో
ఇక వీళ్లే కాకుండా డ్రగ్స్ కేసులో సంజనా గల్రానీ, రాగిణి ద్వివేది జైలు శిక్ష అనుభవించారు. తాజాగా తెలుగు నటి హేమ బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమె కూడా అరెస్ట్ కావడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











