Don't Miss!
- News
Vastu tips: జీవితంలో సంపద, ఆరోగ్యం, ఆనందం కోసం ఈ వాస్తు చిట్కాలు పాటించండి!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
వీరసింహా రెడ్డిలో హైలెట్ కాబోయే యాక్షన్ సీన్స్.. వాటికి విజిల్స్ వేయాల్సిందే!
నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేశాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఊర మాస్ యాక్షన్ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించారు. అనంతపురం బ్యాక్ డ్రాప్ లోనే దర్శకుడు కొన్ని నిజజీవితంలోని సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను తీర్చిదిద్దినట్లు చెప్పాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు.
ఇక సినిమాకు సంబంధించిన అన్ని రకాల పనులు కూడా పూర్తయ్యాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు సినిమాను తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వీరసింహా రెడ్డి ఫైనల్ రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగా అయితే మూడు గంటలకు పైగా రన్ టైమ్ అనుకోగా ఆ తరువాత దర్శకుడు ఎడిటర్ తో చర్చించి ఫైనల్ రన్ టైమ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మొత్తం 11 ఫైట్స్ హైలెట్ కాబోతున్నాయి. ఫస్ట్ హాఫ్ లో 4 ఫైట్స్ ఊహించని స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చే విధానం కూడా గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ లోనే 3 సాంగ్స్ కూడా హైలెట్ కాబోతున్నాయి. జై బాలయ్య సాంగ్ విజువల్స్ కూడా ఫ్యాన్స్ విజిల్స్ వేయించి విధంగా ఉంటాయని చెబుతున్నారు. ప్రధానంగా విలన్స్ ను గోపిచంద్ తన మార్క్ కు తగ్గట్టుగా చాలా పవర్ఫుల్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా టెంప్లెట్ అయితే బాలయ్య గత సినిమాలకు తగ్గట్టుగా రెగ్యులర్ గానే ఉంటుందట. ఇక చెన్నకేశవ రెడ్డి, సింహా, లెజెండ్ అలాగే అఖండ సినిమా తరహాలో రెగ్యులర్ గా డబుల్ రోల్స్ తరహాలో సినిమా ఉంటుందట. ఇక ఆ స్టైల్ లో వచ్చిన ప్రతీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బాలయ్య రేంజ్ ను పెంచాయి.