»   » బాలక్రిష్ణ సినిమాకి అలాంటిపేరా..?? పూరీ ఎం ఆలొచిస్తున్నాడు

బాలక్రిష్ణ సినిమాకి అలాంటిపేరా..?? పూరీ ఎం ఆలొచిస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణతో పూరీ జగన్నాధ్ మూవీ చేయనున్నాడనే విషయం పాత సంగతే. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కోసం పూరీ జగన్నాధ్ కు మొదట అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆటో జానీ స్క్రిప్ట్ ను పూరీ ప్రిపేర్ చేసినా.. సెకండాఫ్ విషయంలో తేడాలు రావడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. అదే స్క్రిప్ట్ ను బాలయ్యకి తగినట్లుగా మార్చాడట పూరీ. ఆయన స్టైల్ కు.. బాడీ లాంగ్వేజ్ కు తగినట్లుగా కొన్ని సీన్లను రీరైట్ చేసి వినిపించాడట. ఇప్పుడు బాలయ్యతో చేస్తున్న సినిమా ఆటో జానీయే అంటున్నారు సన్నిహితులు. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టెయినర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంతో.. బాలయ్యను కొత్తగా ప్రెజెంట్ చేసేందుకు రెడీ అయ్యాడట పూరీ జగన్నాధ్.

సహజంగా పూరీ జగన్నాధ్ సినిమాల పేర్లు చాలా క్యాచీగాను.. సింపుల్ గాను ఉంటాయి. అలాగే వెరైటీగా కూడా ఉంటాయి. అలా టైటిల్ తోనే సగం ఆకర్షించేసే పూరీ జగన్నాథ్.. బాలకృష్ణ చిత్రానికి "టపోరి" అనే పైరు సూచించాడట. వినగానే బాలయ్యకు కూడా ఈ పేరు నచ్చేసిందని తెలుస్తోంది. అయితే.. ఇదే టైటిల్ ని ఫిక్స్ చేసే విషయంలో మాత్రం ఇంకా ఆలోచనలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇలా పునరాలోచించుకోవడానికి కారణం ఏంటంటే.. ఈ పేరు వినగానే.. చిరంజీవి సినిమాలోని పాట గుర్తుకు వస్తుండడమే. రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీలో టపుటపు టపోరీ అనే పాట ఎంత పాపులరో మనకు తెలిసిందే. ఈ టైటిల్ పెట్తటమే విచిత్రంగా ఉంటే బాలయ్య బాబుకోసం ఇలాంటి టైటిల్ ఎంచుకోవటమే మరింత వింతగా ఉంది...

Nandamuri Balayya as Tapori?

అనూప్ రూబెన్స్ బాలకృష్ణ సినిమాకు సంగీతం అందించడం ఇదే మొదటి సారి కాగా అనూప్ గతంలో పూరీ సినిమాలైన టెంపెర్, హార్ట్ ఎటాక్ మరియు నేను నా రాక్షసి మొదలైన చిత్రాలకు సంగీతం అందించారు. వీరిరువురి కలయికలో మళ్ళీ సినిమా రాబోతున్నందుకు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. అలాగే ఈ సినిమాను దసరాకు విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నారు.

English summary
Sources say that the makers are considering ‘Tapori’, to be the title for Nandamuri Balakrishna forth coming action drama.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu