»   »  నందమూరి అందగాళ్ళు ఒకే చోట...

నందమూరి అందగాళ్ళు ఒకే చోట...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kalyan Ram
నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ , ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వీరంతా ఒకే వేదికపై కనిపించి అభిమానులను అలరించనున్నారు. సినిమా రంగంలో లో ఉన్న ఈ నందమూరి వారసులంతా ఒకే వేదిక మీద ఈమధ్య కాలంలో ఎన్నడూ కనిపించలేదు. అలాంటిది జూన్ 28న వారంతా ఒకే వేదిక మీదకు రానున్నారు. యేమిటా రోజు ప్రత్యేకత అంటే కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన 'హరే రామ్' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆరోజు జరగనున్నది.

ఆ కార్యక్రమానికి వీరంతాహాజరు కానున్నారు. గడచిన కొద్ది కాలంగా సవతి సోదరులు అయిన కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్ మధ్య సన్నిహితత్వం పెరుగుతూ వస్తోంది. ఎన్టీఆర్ సినిమాల కార్యక్రమాలకు కల్యాణ్‌రామ్ వస్తుండగా, ఇప్పుడు కల్యాణ్‌రామ్ సినిమా కార్యక్రమానికి ఎన్టీఆర్ రానున్నాడు. ఈ ఆడియో వేడుకను భారీ స్థాయిలో జరపడానికి కల్యాణ్‌రామ్ సన్నాహాలు చేస్తున్నాడు. హర్షవర్ధన్(స్వర్ణ సుబ్బారావు) దర్శకత్వం వహించిన ఈ సినిమాను సొంత బానర్ యన్‌టీఆర్ ఆర్ట్స్‌పై అతడే నిర్మించాడు.

కల్యాణ్‌రామ్ ద్విపాత్రలు పోషించగా, ప్రియమణి హీరోయిన్ గా నటించింది. 'హ్యాపీ డేస్'తో ఒక్కసారిగా లైమ్‌ లైట్‌లోకి వచ్చిన మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇందులో కళ్యాణరామ్ పోలీసు పాత్రనొకటి చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X