For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఓ రేంజిలో పేలింది : ( 'పటాస్‌' ట్రైలర్)

  By Srikanya
  |

  హైదరాబాద్‌: నందమూరి కల్యాణ్‌.. పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో తెరకెక్కిన చిత్రం 'పటాస్‌'. సొంత బ్యానర్‌ నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. అనిల్‌ రావిపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర ఆడియో గురువారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ పంచ్ లతో అందరినీ ఆకట్టుకుంటోంది. చూసిన ప్రతీవారు హిట్ గ్యారెంటీ అంటున్నారు. మీరూ ఓ లుక్కేయండి..

  ఈ సినిమా గురించి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘రొమాంటిక్‌ , యాక్షన్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకొంది. సాయికార్తీక్‌ మంచి సంగీతాన్ని అందించారు. ఈ నెల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని తెలిపారు.

  https://www.facebook.com/TeluguFilmibeat

  Nandamuri Kalyan Ram Patas Trailer

  ఇక నందమూరి జానకిరామ్‌ మృతితో కంగుతిన్న కళ్యాణ్‌రామ్‌ తను నటించిన పటాస్‌ చిత్రం విడుదలపై కొంత జాప్యం చేయాల్సి వచ్చింది. దీంతో పటాస్‌ చిత్రం నైజాం హక్కుల్ని దిల్‌రాజు కొన్నట్లు తాజా సమాచారం. దిల్‌రాజు రైట్స్‌ కొన్నాడంటే సినిమా బిజినెస్‌ వేగంగా జరుగుతుందన్నమాటే. ఎందుకంటే సినిమాపై నమ్మకం ఉంటేనే దిల్‌రాజు సినిమా హకుల్ని తీసుకుంటారని వినికిడి.

  ఒక్క ఆంధ్రా హకుల్ని మాత్రం కళ్యాణ్‌రామ్‌ తీసుకుని మిగిలిన హక్కుల్ని దిల్‌రాజుకు అప్పగించినట్లు సమాచారం. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్‌రామ్‌ నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

  అలాగే నైజాం, కృష్ణా తన సొంత రిలీజ్ చేసుకుని మిగతా ఏరియాలను తను బిజినెస్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇదే నిజమైతే కళ్యాణ్ రామ్ సొంత సినిమా కావటంతో పూర్తిగా రిస్క్ లేకుండా ఒడ్డున పడినట్లే అని చెప్పాలి. నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ‘పటాస్‌' చిత్రం షూటింగ్‌ పూర్తయింది.

  కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ''యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. కథలో వినోదానికీ చోటుంది. భారీ హంగులతో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరిస్తుంది'' అన్నారు. శ్రుతి సోధి పంజాబీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొంది శ్రుతి. అటు అందంగా కనిపించడంతోపాటు ఇటు నటనలోనూ రాణిస్తోంది. చిత్రంలో కల్యాణ్‌రామ్‌ పోలీసు అధికారిగా కనిపిస్తారు. కథలో మలుపులు రక్తికట్టించేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.

  సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్‌ మురారి, ఎడిటింగ్‌: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్‌.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్‌, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

  English summary
  Nandamuri Kalyan Ram’s latest movie Patas is all set to release on December. This film’s teaser trailer is out and looks promising. Patas which is touted to be Action comedy entertainer is coming up under the direction of writer turned Anil Ravipudi. The technical aspects and visuals are stunning going by the terrific looking teaser trailer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X