»   » ‘ఎంఎల్ఏ’ ప్రీ రిలీజ్: డైరెక్టర్ టార్చర్ పెట్టాడన్న కళ్యాణ్ రామ్, పోసాని స్పీచ్‌లొ పవన్ కళ్యాణ్!

‘ఎంఎల్ఏ’ ప్రీ రిలీజ్: డైరెక్టర్ టార్చర్ పెట్టాడన్న కళ్యాణ్ రామ్, పోసాని స్పీచ్‌లొ పవన్ కళ్యాణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
అక్కడా పవన్ మాటే...బాలయ్య ఇది విన్నార మరి?

కళ్యాణ్ రామ్, కాజల్ హీరో హీరోయిన్లుగా టి.జి.విశ్వప్రసాద్‌ సమర్పణలో బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వంలో కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మిస్తోన్న చిత్రం 'ఎంఎల్‌ఎ'. ఈ సినిమా మార్చి 23న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.

పటాస్ తర్వాత ఈ సినిమానే

పటాస్ తర్వాత ఈ సినిమానే

ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... సినిమా అంటే కాంబినేషన్ సెట్ చేసి తీయడం కాదు, కథను నమ్ముకుంటే ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుందని నమ్ముతాను. ఈ చిత్ర నిర్మాతలు కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి కూడా అదే నమ్మారు. నేను ఫస్ట్ టైమ్ రెండు గంటలు కథ విన్నది పటాస్ సినిమాకు. పటాస్ తర్వాత మళ్లీ అంత సమయం కథ విన్నది ఈ సినిమాకే. అప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ వచ్చిందో ఈ సినిమా కథ విన్నపుడు కూడా అలాగే అనిపించింది, దర్శకుడు ఉపేంద్ర కళ్లకు కట్టినట్లు సినిమా కథ చెప్పారు అని కళ్యాణ్ రామ్ తెలిపారు.

డైరెక్టర్ టార్చర్

డైరెక్టర్ టార్చర్

ఈ సినిమాకు దర్శకుడు నన్ను ఫస్ట్ డే నుండే బాగా టార్చర్ పెట్టాడు. ఆయన పెట్టే టార్చర్ కు నాలుగైదు కేజీలు తగ్గాను. తనకు కావాల్సిన రైమింగ్ వచ్చే వరకు వన్ మోర్ వన్ మోర్ అంటూ చేయించేవాడు. ఓ సారి ఉదయం 7 గంటలకు మొదలు పెట్టి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్రేక్ ఇవ్వలేదు. ఆయన అలా టార్చర్ పెట్టాడు కాబట్టే నేను ఈ సినిమాలో కొత్తగా కనిపించాను. స్క్రీన్ మీద నన్ను నేను చూసుకున్న తర్వాత ఆ టార్చర్ అంతా మరిచిపోయాను... అని కళ్యాణ్ రామ్ తెలిపారు.

పోసాని ఫన్నీ స్పీచ్, పొరపాటున పవన్ కళ్యాణ్ పేరు

‘ఎంఎల్ఏ' ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న పోసారి కృష్ణ మురళి తన ఫన్నీ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. మధ్యలో ఆయన కళ్యాణ్ రామ్ అనబోయి పొరపాటున పవన్ కళ్యాణ్ అంటూ సంబోధించడంతో అంతా ఆశ్చర్యపోయారు.

మార్చి 23న విడుదల

మార్చి 23న విడుదల

కళ్యాణ్ రామ్, కాజల్, రవి కిష‌న్‌, పోసాని , జయప్రకాశ్ రెడ్డి, అజయ్, వెన్నెల కిశోర్, పృథ్వి, శివాజీ రాజా,ప్రభాస్ శ్రీను, లాస్యా , మనాలి రాథోడ్ ఈ చిత్రం లో ప్రధాన తారాగ‌ణంగా న‌టించారు. ఈ చిత్రానికి సమర్పణ : టీజీ విశ్వప్రసాద్ , రచనా సహకారం : ప్రవీణ్ వర్మ, ఆది నారాయణ, సంగీతం: మని శర్మ , సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ , ఎడిటింగ్‌: తమ్మిరాజు , సమర్పణ : టీజీ విశ్వప్రసాద్ , కో ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభొట్ల , నిర్మాతలు : సీ భరత్ చౌదరి, యంవీ కిరణ్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్.

English summary
MLA Movie Pre Release Event held at Hyderabad. Kalyan Ram, Kajal Aggarwal, Manali Rathod, Lasya, Brahmanandam, Ravi Kishan, Upendra Madhav, Kiran Reddy, Bharath Chowdary, Vishwa Prasad, Allari Naresh, D Suresh Babu, Vamsi Paidipally, Srinu Vaitla, Prudhvi Raj, Posani Krishna Murali, Gemini Kiran, Kona Venkat, N Shankar, Ramajogayya Sastry, Shyam Kasarla, Suma were present.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X