»   » కల్యాణ్‌రామ్‌ 'షేర్‌' ఫొటో టీజర్ (వీడియో)

కల్యాణ్‌రామ్‌ 'షేర్‌' ఫొటో టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హీరో కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'షేర్‌'. కల్యాణ్‌రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫొటో టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విజయలక్ష్మి పిక్చర్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మల్లిఖార్జున (కత్తి మల్లి) దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది. ఆ ఫొటో టీజర్ ని మీరు ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

 Nandamuri Kalyan Ram's Sher digital poster

చిత్రం విశేషాలకు వస్తే...

నందమూరి కళ్యాణ్‌ రామ్‌, సోనాల్‌ చౌహాన్‌ హీరో హీరోయిన్లుగా సాయి నిహారిక, శరత్‌ చంద్‌ సమర్పణలో మల్లికార్జున్‌ దర్శకత్వం లో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న చిత్రం 'షేర్‌'. షూటింగ్ పూర్తి చేసుకుంది.

నిర్మాత కొమర వెంకటేష్‌ మాట్లాడుతూ, 'కళ్యాణ్‌రామ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ 'షేర్‌' చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాం. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తారు.
పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేయడానికి ఫ్లాన్‌ చేస్తున్నాం. నిర్మాతల హీరో కళ్యాణ్‌రామ్‌తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం కూడా 'పటాస్‌'లాగే పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను' అని అన్నారు.

దర్శకుడు మల్లి మాట్లాడుతూ... 'కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో 'షేర్‌' ఒక సంచలనాత్మకమైన చిత్రమవుతుంది. నందమూరి అభిమానులు పండగ చేసుకునేలా ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ విజృంభించి నటించారు' అని దర్శకుడు మల్లికార్జున్‌ తెలిపారు.

చిత్రం ఇన్ఫో...

ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని సాంగ్స్ ని ఇప్పుడు షూట్ చేస్తున్నారు. ఇటీవలే ఓ సాంగ్ షూట్ ని పూర్తి చేసిన ఈ చిత్ర టీం ఈ రోజు నుంచి మరో సాంగ్ షూటింగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టారు.

కళ్యాణ్ రామ్ పై షూట్ చేస్తున్న ఈ పాటకి డాన్స్ మాస్టర్ జానీ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు. పటాస్ సినిమాల లాగానే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఓ డిఫరెంట్ పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని ఈ చిత్ర టీమ్ అంటోంది. ఈ చిత్రం కాకుండా కళ్యాణ్ రామ్ రవితేజ హీరోగా నిర్మించిన ‘కిక్ 2′ సినిమా త్వరలో రిలీజ్ కి సిద్దమవుతోంది.

English summary
Nandamuri Kalyan Ram's Sher Photo Teaser relesed.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu