»   » ఈ ముగ్గురిలో మోక్షఙ్ఞ దర్శకుడు ఎవరు..?

ఈ ముగ్గురిలో మోక్షఙ్ఞ దర్శకుడు ఎవరు..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలో హీరోగా రంగ ప్రవేశం చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోక్షజ్ఞ ఓ వైపు చదువు కొనసాగిస్తూనే, మరో వైపు సినీ రంగ ప్రవేశానికి కావాల్సిన నటన, డాన్స్, ఫైట్స్ లాంటి విద్యల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం....మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య తెర వెనక ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

కొన్ని కథలని కూడా విని వాటిలో మార్పులు చేయిస్తున్నారట. బాలయ్యతో "లెజెండ్" చిత్రాన్ని తెరకెక్కించిన సాయి కొర్రపాటి మోక్షజ్ఞ సినిమాను నిర్మించబోతన్నారని అనుకుంటున్నారు గానీ ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మోక్షు హీరోగా వ‌చ్చే డెబ్యూ మూవీ 2017లో ఉంటుంద‌ని బాల‌య్య ఇప్ప‌టికే చాలాసార్లు ఎనౌన్స్ చేశాడు. త‌న కుమారుడు సినిమా రంగం ఎంట్రీ విష‌యంలో లెక్క‌లు తేడా రాకుండా బాల‌య్య చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు.

Nandamuri Mokshagna Movie Confirmed

మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గౌతమీ పుత్ర శాతకర్ణి తరువాత మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన పనులు మొదలవుతాయని అనుకుంటున్నారు. ఇక 100 సినిమా షూటింగ్ కూడా మరి కొద్ది రోజుల్లో అయిపోతూండటం తో మొక్షఙ్ఞ సినిమా మళ్ళీ తెరమీదికి వచ్చింది. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ మొదటి సినిమా చేసే అవకాశం ఏ దర్శకుడికి దక్కనుందోననేది ఆసక్తికరంగా మారింది. ఆయన ఎంచుకునే కథ విషయంలోను వాళ్లు అంతే ఆతృతను కనబరుస్తున్నారు.

అయితే బాలకృష్ణ మంచి కథతో మోక్షజ్ఞను ప్రేక్షుకుల ముందుకు తీసుకు వెళ్లాలనే ఆలోచనలో వున్నారని వినికిడి. టీనేజ్ కి తగిన కథను రెడీ చేయించాలనీ ... యాక్షన్ ఎంటర్టైనర్ గా కాకుండా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ద్వారా మోక్షజ్ఞను ప్రేక్షకులకు పరిచయం చేయాలనే యోచనలో బాలకృష్ణ ఉన్నారని అంటున్నారు. గౌత‌మీపుత్ర‌శాత‌క‌ర్ణి సినిమాలో మోక్ష‌జ్ఞ రెండు రోల్స్ చేస్తున్నాడు. అటు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గాను కొద్ది నిమిషాల పాటు ఉండే వ‌శిష్టీపుత్ర పులోమావి క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌.

Nandamuri Mokshagna Movie Confirmed

మరీ పెద్ద పెద్ద ఫైట్లు ఉండకూడదని మోక్షఙ్ఞ ఎంట్రీ సింపుల్ గానూ "బాయ్ నెక్స్ట్ డోర్" లాంటి ఇమేజ్ తోనూ ఉండాలని బాలకృష్ణ అనుకుంటున్నారట. ఇక దర్శకుల విషయానికి వస్తే, రాజమౌళి .. త్రివిక్రమ్ .. కొరటాల శివ వంటి దర్శకులు ఆయన దృష్టిలో వున్నారని చెప్పుకుంటున్నారు. మరి ఈ దర్శకులలో మోక్షజ్ఞని ఎవరు తెర మీదకి తీసుకొస్తారో చూడాలి...

English summary
Nandamuri moakshagna new movie came on the frame again..... Director hunt is started for mokshagna..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu