For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తల్లిదండ్రులు ఓకే అన్నాకే హీరోయిన్ నగ్నంగా (ఫోటో ఫీచర్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ నందనా సేన్ నటించిన ‘రంగ్ రసియా' చిత్రం ఈ నెల 7వ తేదీన విడుదలవుతోంది. 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. రాజా రవివర్మ పాత్రలో రణదీప్ హుడా నటిచగా....రాజా రవివర్మ ఊహాల్లో విహరించే బ్యూటీగా ఆమె నటించింది.

  కథ ప్రకారం ఆమె ఈ చిత్రంలో పలు నగ్న సన్నివేశాల్లో నటించింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ....తెరపై నగ్నంగా నటించడం అనేది చాలా కష్టమైన అంశం. దాన్నొక బాధ్యతగా స్వీకరించినప్పుడే పర్ ఫెక్టుగా నటించగలం. ‘రంగ్ రసియా' చిత్రంలో నగ్నంగా నటించడానికి ఓకే చెప్పే ముందు మా తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నాను. ఇదొక చారిత్రాత్మక చిత్రం. వారు విషయం అర్థం చేసుకున్నారు. వారి అనుమతితో ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించాను అని తెలిపింది నందనా సేన్.

  ఈ చిత్రం చాలా కాలం క్రితమే పూర్తయింది. 2008లో నవంబర్లో లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. తాజాగా ఈ చిత్రాన్ని ఇండియా వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సందేశ్ శాండిల్య ఈ చిత్రానికి సంగీతం అందించారు. దీపా సాహి నిర్మాత. కేతన్ మెహతా దర్శకత్వం వహించారు.

  ఈ చిత్రాన్ని రంజిత్ దేశాయ్ రాసిన ‘రాజా రవివర్మ' పుస్తకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు. అయితే ఈ చిత్రాన్ని రాజా రవివర్మ జీవితకథకు ఆపాదించడంపై ఆయన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజా రవివర్మ జీవితగాధకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదన్న ప్రకటన లేకుండా సినిమాను ప్రదర్శించడానికి వీల్లేదని కోర్టు కెక్కారు.

  నందనా సేన్ గురించి వివరాలు, హాట్ ఫోటోలు స్లైడ్ షోలో...

  నందనా సేన్

  నందనా సేన్

  నందనసేన్ కోల్‌కతాలోని బెంగాలీ హిందూ ఫ్యామిలీలో జన్మించారు. ఆమె తండ్రి నోబెల్ ఫ్రైజ్ విన్నర్, భారత రత్న అవార్డు గ్రహీత ఆమర్థ్య సేన్. తల్లి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన ప్రముఖ రచయిత నబనీత దేవ్ సేన్

  బాల్యం

  బాల్యం

  నందనా సేన్ బాలయ్యం యూరఫ్ దేశాలు, ఇండియా, అమెరికాలోని పలు ప్రాంతాల్లో సాగింది.

  నటన వైపు..

  నటన వైపు..

  నందనా సేన్ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీలో లిటరేచర్ విభాగంలో పలు అంశాలపై తన చదువుకు సాగించింది. ఆ తర్వాత తన ప్రయాణం నటన వైపు కొనసాగించింది.

  సేవా కార్యక్రమాల్లో

  సేవా కార్యక్రమాల్లో

  థియేటర్ ఆర్ట్స్, సినిమాల్లోనూ నటించే నందనా సేన్....పిల్లల హక్కుల కోసం జరిగే కార్య్రమాల్లోనూ పాల్గొంటూ తన సేవా నిరతిని చాటుకుంటోంది.

  నిర్మాతతో సహజీవనం

  నిర్మాతతో సహజీవనం

  నందనా సేన్ నిర్మాత మధు మంతెనతో దాదాపు 9 సంవత్సరాల పాటు సహజీవనం చేసింది.

  జాన్ మాకిసన్‌తో వివాహం

  జాన్ మాకిసన్‌తో వివాహం

  46 ఏళ్ల నందనా సేన్ గత సంవత్సరం...ప్రముఖ ప్రచురణ సంస్థ సీఈఓ జాన్ మాకిసన్ అనే విదేశీయుడిని పెళ్లాడింది.

  సినిమా రంగం ప్రవేశం

  సినిమా రంగం ప్రవేశం

  1997లో వచ్చిన ‘ది డాలన్, గుడియా' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా నందనా సేన్ సినీరంగ ప్రవేశం చేసారు.

  వివిధ భాషా చిత్రాల్లో

  వివిధ భాషా చిత్రాల్లో

  బాలీవుడ్ చిత్రాలతో పాటు హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ చిత్రాల్లో నందనా సేన్ నటించారు.

  English summary
  Actress Nandana Sen has gone bold on the screen to play renowned painter Raja Ravi Varma's muse in forthcoming Rang Rasiya. She admits doing nude scenes is a huge responsibility and she had talked it out with her parents before giving her nod.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X