»   » నంది పురస్కారాలు: ప్రభాస్, నాని, రాజమౌళికి అవార్డులు!

నంది పురస్కారాలు: ప్రభాస్, నాని, రాజమౌళికి అవార్డులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత 2012 నుండి నంది అవార్డలు ప్రస్తావన లేకుండా పోయిన సంగతి తెలిసిందే. అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇపుడు కాస్త సెట్టవ్వడంతో కమిటీ వేసి అవార్డలను ప్రకటించారు.

2012, 2013 రెండు సంవత్సరాలకు ఈ అవార్డులను ప్రకటించారు. 2012 సంవత్సర కమిటీకి జయసుధ, 2013 సంవత్సర కమిటీకి కోడి రామకృష్ణ ఛైర్మన్లుగా వ్యవహరించారు. కమిటీ నివేదికను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేసారు. అనంతరం మీడియాకు వివరాలు తెలియజేసారు.

Nandi Awards 2012 & 2013 details

2012 సంవత్సరానికి గాను అవార్డుల వివరాలు...

ఉత్తమ చిత్రం- ఈగ
రెండో ఉత్తమ చిత్రం- మిణుగురులు
మూడో ఉత్తమ చిత్రం- మిథునం
ఉత్తమ దర్శకుడు- ఎస్‌.ఎస్‌.రాజమౌళి(ఈగ)
ఉత్తమ కథానాయకుడు- నాని(ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ కథానాయిక- సమంత(ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ సహాయనటుడు- అజయ్‌(ఇష్క్‌)
ఉత్తమ సహాయనటి- శ్యామల(వీరంగం)
బెస్ట్‌ పాపులర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌- జులాయి
ఉత్తమ గాయకుడు- శంకర్‌ మహాదేవన్‌
ఉత్తమ గాయని- గీతామాధురి
ఉత్తమ సంగీత దర్శకులు- కీరవాణి(ఈగ), ఇళయరాజా(ఎటో వెళ్లిపోయింది మనసు)

2013 సంవత్సరానికి గాను అవార్డుల వివరాలు

ఉత్తమ చిత్రం- మిర్చి
రెండో ఉత్తమ చిత్రం- నా బంగారు తల్లి
మూడో ఉత్తమ చిత్రం- ఉయ్యాల జంపాల
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- అత్తారింటికి దారేది
ఉత్తమ కుటుంబ కథా చిత్రం- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఉత్తమ కథానాయకుడు- ప్రభాస్‌(మిర్చి)
ఉత్తమ కథానాయిక- అంజలి(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
ఉత్తమ దర్శకుడు- దయా కొడవగంటి
ఉత్తమ సహాయనటుడు- ప్రకాశ్‌రాజ్‌

English summary
The Nandi Awards for the year 2012 and 2013 was announced at a press conference held on wednessday noon by the chairmans of the jury committees.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu